జనసేనను వదిలించుకుంటారా ? 

గత కొద్ది రోజులుగా ఏపీ బీజేపీ స్పీడ్ పెంచినట్టుగా కనిపిస్తోంది.వైసీపీ ప్రభుత్వం పై పోరాటాలు చేయడమే ఏకైక లక్ష్యంగా పెట్టుకున్నట్టు కనిపిస్తోంది.

దక్షిణాది రాష్ట్రాల్లో బలపడాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్న బిజెపికి తెలంగాణలో పరిస్థితి అనుకూలంగా మారినా, ఏపీలో మాత్రం పరిస్థితి మెరుగుపడడం లేదని, ఆ పార్టీ అగ్ర నాయకులు అభిప్రాయపడుతున్నారు.జనసేన పార్టీతో పొత్తు పెట్టుకున్నా, తమకు పెద్దగా ఉపయోగం లేకుండా పోయిందని, ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.

అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ , ఆయన అభిమానుల బలం ఇలా అన్ని లెక్కలు వేసుకుంటున్నారు బిజెపి నాయకులు.పవన్ కళ్యాణ్ బీజేపీ విషయంలో అంతగా పట్టించుకోనట్టుగా వ్యవహరిస్తుండడంతో,  ఏపీలో వైసీపీ ప్రభుత్వం పై పోరాటం చేయాలని బిజెపి డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది.

  ఇటీవల జరిగిన తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలు , స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి జనసేన కలిసి వెళ్లినా, ఉపయోగం లేకుండా పోయిందని, ప్రస్తుతం మారిన పరిస్థితుల్లో బిజెపి దూకుడుగా ముందుకు వెళ్లకపోతే, రాబోయే ఎన్నికల్లో ఘోర పరాభవం తప్పదనే నిర్ణయానికి ఏపీ బీజేపీ నేతలు వచ్చినట్టు గా కనిపిస్తున్నారు.కడప జిల్లా పొద్దుటూరు లో టిప్ సుల్తాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు వైసీపీ ఎమ్మెల్యే ప్రయత్నించగా,  బిజెపి అక్కడ పెద్ద పోరాటం చేసింది.

Advertisement

టిప్పుసుల్తాన్ విగ్రహ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పెద్ద ఎత్తున నాయకులతో ధర్నా నిర్వహించారు.రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. 

 చివరకు జిల్లా కలెక్టర్ విగ్రహ ఏర్పాటుకు అనుమతి నిరాకరిస్తూ ఆదేశాలు జారీ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బహిరంగ ప్రదేశాలలో విగ్రహాల ఏర్పాటుకు అనుమతి నిరాకరిస్తున్నట్లు కలెక్టర్ ఉత్తర్వులు పేర్కొనడంతో బీజేపీ నేతల్లో ఉత్సాహం పెరిగింది  తమ పోరాటం వల్లే వైసిపి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టగలిగాము అని , ఇక అన్ని విషయాలను ఇదే ఈ విధంగా ముందుకు తీసుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు ఈ ఆందోళన కార్యక్రమానికి జనసేన కూడా హాజరు కాకపోవడాన్ని ఏపీ బీజేపీ నేతలు గుర్తు చేసుకుంటున్నారు.ఇక జనసేన ను తాము పెద్దగా పట్టించుకోనవసరం లేదు అన్నట్లుగానే ఏపీ బిజెపి నాయకుల వ్యవహార శైలి కనిపిస్తుండడంతో, ఈ రెండు పార్టీలు త్వరలోనే తెగతెంపులు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.

Advertisement

తాజా వార్తలు