సినిమా పరిశ్రమలో నిలదొక్కుకోవాలంటే అందంతో పాటు అభినయం ఎంతో ముఖ్యం.అయితే కొన్నిసార్లు నటనతో అదరగొడితే చాలు.
అందం అనేది సెకెండరీ అని నిరూపిస్తారు కొందరు నటీమణులు.అలా వచ్చిన హీరోయిన్ నిత్యా మీనన్.
అందరూ జీరో సైజ్ అంటూ దూసుకుపోతున్నా.తాను మాత్రం బొద్దుగా ఉన్నా ముద్దుగానే కనిపిస్తుంది.
పైగా చక్కటి నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది.తెలుగు సినిమా పరిశ్రమలో ఈ కేరళ కుట్టి తనకంటూ ప్రత్యేకత చాటుకుంది.
అయితే ఈ బొద్దుగుమ్మ సినిమాల్లోకి ఎలా వచ్చింది? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
తెలుగులో నిత్యా మీనన్ నటించిన తొలి సినిమా అలా మొదలైంది.
నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హీరోగా నాని నటించాడు.తన మొదటి సినిమాతోనే నిత్యా చక్కటి గుర్తింపు దక్కించుకుంది.
అంతేకాదు.సింగర్ గా కూడా మంచి పేరు తెచ్చుకుంది.
తెలుగుతో పాటు మళయాలంలోనూ మంచి సినిమాలు చేసింది.చక్కటి గుర్తింపు తెచ్చుకుంది.
సినిమాల్లో పాత్రలు చేసే విషయంలో నిత్య అంత ఈజీగా ఓకే చెప్పదు.తనకు నచ్చితేనే ఓకే చెప్తుంది.
కథ పరంగా నచ్చకపోయినా.ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తామని చెప్పినా తను ముఖం మీదే నో చెప్తుందట.
అందుకే తనకు ఎక్కువ అవకాశాలు రావడం లేదంటారు సినీ జనాలు.

నిజానికి నిత్యా మీనన్ చైల్డ్ ఆర్టిస్టుగానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.తను స్కూల్ డేస్ లో ఉండగా.తన కుటుంబానికి చెందిన ఓ సినిమా వ్యక్తి ఆ అమ్మాయి ఫోటో చూశాడట.
తనను ఆడిషన్స్ కు రావాలని చెప్పాడట.తన కుటుంబ సభ్యులతో కలిసి అక్కడికి వెళ్లింది నిత్యా.
అలా ఫ్రెంచ్ ఆక్సెంట్ సినిమాలో అవకాశం వచ్చింది.అప్పుడు నిత్య వయసు 8 ఏండ్లు.
ఆమె డైలాగులు బట్టిపట్టి చెప్పేదట అప్పట్లో.నిత్య నటనకు దర్శకుడు సహా సినీ జనాలంతా ఆశ్చర్యపోయారట.
అలా నిత్యా సినిమాల్లోకి వచ్చింది.