నేడు తెలంగాణ మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు.ఈ సందర్బంగా సినీ ప్రముఖులు పదుల సంఖ్యలో ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలయజేశారు.
కేటీఆర్ కు పుట్టిన రోజుతో సోషల్ మీడియాలో హ్యాపీ బర్త్ డే కేటీఆర్ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయ్యింది.సహజంగా సినిమాల హీరోల పుట్టిన రోజులకు మాత్రమే హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ అవుతాయి.
కాని ఈసారి కేటీఆర్ బర్త్ డే హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో కొద్ది సమయం ట్రెండ్ అయ్యింది.అంతగా సినీ ప్రముఖులు మరియు రాజకీయ నాయకులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
కేటీఆర్ కు బర్త్ డే శుభాకాంక్షలు సినిమా వారి నుండి అధికంగా వెళ్లడం వల్లే ట్రెండ్ అయ్యాడు అనడంలో సందేహం లేదు.టాలీవుడ్ లో కేటీఆర్ కు ఎంతో మంది సన్నిహితులు ఉన్నారు.
ఆయన అందరితో చాలా సన్నిహితంగా ఫ్రెండ్లీగా ఉంటాడు.

కేటీఆర్ ఇండస్ట్రీలో ఏ సమస్య ఉన్నా కూడా వెంటనే స్పందించేందుకు ముందు ఉంటారు.ఆయన వద్దకు వెళ్లిన వారికి సాయం గా నిలవడంతో పాటు వెంటనే వారికి తనవంతు సాయంను అందిస్తూ ఉంటారు.సినిమా వారు కూడా ఏ సమయంలో వెళ్లినా కూడా తప్పకుండా వేడుకలకు హాజరు అయ్యేందుకు సిద్దం అవుతాడు.
రాజకీయాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా కేటీఆర్ వెంటనే తన ను వెదుక్కుంటూ వచ్చారంటూ సినిమా వేడుకలకు హాజరు అవుతూ ఉంటాడు.మనసుకు నచ్చిన సినిమాల గురించి సోషల్ మీడియాలో చెప్పడం ద్వారా ఇండస్ట్రీ వారికి మరింతగా చేరువ అయ్యాడు.
అలా కేటీఆర్ పుట్టిన రోజు న పలువురు ప్రముఖులు పోటీ పడ్డారు.కేటీఆర్ కు చిరంజీవి.మహేష్ బాబు సహా ఎంతో మంది పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు.