ప్రస్తుత సమాజంలో ప్రేమ పేరిట మోసాలు పెరిగిపోతూనే ఉన్నాయి.యువతీ యువకులు ఈ విషయమై అప్రమత్తంగా ఉండాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు.
తల్లిదండ్రులు తమ పిల్లలకు ప్రేమ పట్ల అవగాహన కల్పించాలని చెప్తున్నారు.అయితే, సమాజంలో పెరిగిపోతున్న చెడు పోకడలు, స్మార్ట్ ఫోన్ యూసేజ్ ఇతరాల యువతపై బాగా ప్రభావం చూపుతున్నాయి.
ఈ క్రమంలో ప్రేమ అంటే ఏంటి? ఏది నిజమైన ప్రేమ? అని వారు తెలుసుకునే లోపే నష్టం ఆల్రెడీ జరిగిపోతున్నది.మనం తెలుసుకోబోయే ఘటన ఆ కోవకు చెందినదే.
ప్రేమ పేరిట యువతిని మోసం చేశాడు ఓ యువకుడు.జీవితం పంచుకుందాం అని కల్లిబొల్లి మాటలు చెప్పి పురుగుల మందు తాగించి పరారయ్యాడు.

వివరాల్లోకెళితే.ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా అమృతలూరు మండలం ఇంటూరులో ఈ ఘటన జరిగింది.ఈ ప్రాంతానికి చెందిన ఉమామహేశ్వర్, మౌనిక గతేడాది నుంచి ప్రేమించుకుంటున్నారు.అయితే, పెద్దలు మన మ్యారేజ్‌కు ఒప్పుకునే అవకాశాలుండవని చెప్పి ఉమామహేశ్వర్ మౌనికను పిలిపించాడు.వేరే చోటుకు వెళ్దామని ఒప్పించి మౌనికను అక్కడి నుంచి వేరే ప్రాంతానికి తీసుకుని వచ్చాడు.తీరా వేరే ప్రాంతానికి వెళ్లాక మాట మార్చాడు.
ఒకవేళ మనం పెళ్లి చేసుకున్నా పెద్దలు మనల్ని వదిలిపెట్టరు.బతకనివ్వరు కాబట్టి ఇరువురం చచ్చిపోదాం అని మౌనికకు చెప్పాడు.
మౌనిక అందుకు ఒప్పకుగా ఉమామహేశ్వర్ తన వెంట తెచ్చిన పురుగుల మందును ఆమె చేత తాగించాడు.అయితే, ఆ తర్వాత అతడు కూడా పురుగుల మందు తాగుతాడమని ఆమె భావించింది.
కానీ, ఉమామహేశ్వర్ అక్కడి నుంచి పరారయ్యాడు.మౌనిక ఇక చనిపోతుందని ఉమామహేశ్వర్ వెళ్లిపోయాడు.
కాగా, ఆమె ఆ ప్రదేశంలో ప్రాణాపాయ స్థితిలో ఉండటాన్ని చూసి స్థానికులు 108 అంబులెన్స్‌కు ఫోన్ చేశారు.ప్రస్తుతం మౌనిక తెనాలి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
తనను ఉమా మహేశ్వర్ మోసం చేశాడని, తనకు న్యాయం చేయాలని మౌనిక కోరుతోంది.