మనదేశంలో సాధారణంగా వర్షపాతం ఏటా బాగానే నమోదవుతుంటుంది.ఈ ఏడు కూడా వానలు బానే పడుతున్నాయి.
ఇతర దేశాల్లో ఇలాంటి పరిస్థితులు తక్కువే.ఎడారులు ఎక్కువగా ఉండే దేశాల్లో అయితే వర్షాలు బాగా అరుదు అనే చెప్పొచ్చు.
కాగా, టెక్నాలజీ పరంగా దూసుకుపోతున్న దుబాయ్ ఎన్నో వినూత్న ఆవిష్కరణలు చేసింది.తాజాగా ఎటు చూసినా ఎడారులు ఉండే తమ దేశంపై టెక్నాలజీ ఉపయోగింగి కృత్రిమ వర్షాన్ని కురిపించింది.
తద్వారా దేశం మొత్తాన్ని తన వైపునకు తిప్పుకుంది యూఏఈ.ఇందుకు గాను టెక్నాలజీ ఉపయోగించుకుని మేఘాలకు కరెంట్ షాక్ ఇచ్చారు.
దుబాయ్ ఎడారి ప్రాంతం.కాగా, ఇక్కడ హీట్ చాలా ఎక్కువగా ఉంటుంది.ఎండలు కూడా విపరీతంగా ఉంటాయి.ఉష్ణోగ్రతలు తట్టుకోలేక జనాలు అల్లాడిపోతుంటారు.
ఈ నేపథ్యంలో వర్షం కోసం ఎదురు చూపులు కామన్.ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు దుబాయ్ ఓ వినూత్నంగా ఆలోచించింది.
డ్రోన్ల సాయంతో మేఘాలకు షాకిచ్చి కృత్రిమ వర్షం కురిపించింది.అదెలా సాధ్యమైందంటే.
మేఘాలకు షాక్ ఇచ్చేందుకు గాను యూఏఈ ప్లాన్ చేసింది.ఇందుకు యూకే యూనివర్సిటీ ఆఫ్ రీడింగ్ సైంటిస్టులు సెపరేట్ డ్రోన్స్ తయారు చేశారు.
ఈ డ్రోన్లు మేఘాల్లోకి పవర్‌ను పంపించాయి.ఆ తర్వాత మేఘాల్లో ఎలక్ట్రికల్ బ్యాలెన్స్‌ను మార్చి వానలు విస్తారంగా కురుస్తాయి.
ఈ కొత్త టెక్నాలజీతో యూఏఈలో వర్షాలు పడేందుకు తాము ప్రయత్నించి కొంత మేరకు సక్సెస్ అయినట్లు నిపుణులు చెప్తున్నారు.

ఈ టెక్నాలజీ యూసేజ్ క్రమ పద్ధతిలో ఉంటే ఇకనుంచి దుబాయ్‌లోనూ వానలు తాము అనుకున్నప్పుడల్లా పడతాయి.అయితే, టెక్నాలజీ సాయంతో ఇలా వానలు కురిపించడం వల్ల ఏవైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? మేఘాల తాకిడి ఎలా ఉంటుంది? అనే విషయమై కూడా అధ్యయనం చేయాల్సి ఉంటుంది.ఇకపోతే ఎడారి దేశమైనప్పటికీ దుబాయ్‌లో అప్పట్లో అనగా ఏళ్ల కిందట విస్తారంగా వానలు పడ్డ సందర్భాలూ ఉన్నాయి.
ఈ నేపథ్యంలో ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు టెక్నాలజీ ఉపయోగపడటం మంచిదే.ఎడారిలోనూ టెక్నాలజీతో వర్షం కురిపించొచన్న సంగతి మనకు టెక్నాలజీ ద్వారా తెలుస్తుంది.