ఖమ్మంలో “నిరుద్యోగ దీక్ష” స్టార్ట్ చేసిన షర్మిల..!!

వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల కోసం ప్రతి మంగళవారం దీక్ష చేపడుతున్న సంగతి తెలిసిందే.గతంలో మూడు రోజులపాటు దీక్ష చేసిన షర్మిల ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన రాకపోవడంతో ప్రతి మంగళవారం “నిరుద్యోగ దీక్ష” పేరిట పలు జిల్లాలలో చేపడుతూ వస్తున్నారు.

 Sharmila Starts Unemployment Initiation In Khammam Ys Sharmila, Khammam,latest N-TeluguStop.com

టిఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగుల కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ వైయస్ షర్మిల చేపడుతున్న ఈ దీక్ష ఈరోజు ఉమ్మడి ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం పెనుబల్లి ఎమ్మార్వో ఆఫీస్‌ వద్ద జరుగుతోంది.

Telugu Cm Kcr, Khammam, Tg Latest, Tg, Ys Sharmila, Ysrtp-Telugu Political News

ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు చేపట్టనున్న ఈ దీక్షలో పాల్గొనటానికి విద్యార్థులు మరియు నిరుద్యోగులు భారీ ఎత్తున ఇప్పటికే సభాస్థలికి రావడం జరిగింది.ఖమ్మం జిల్లాలో వైఎస్ఆర్ అభిమానులు అదేరీతిలో పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున దీక్ష ప్రాంగణానికి చేరుకున్నారు.వైయస్ షర్మిల దీక్ష చేపడుతూ ఒకపక్క పార్టీ కార్యకర్తలతో అదేరీతిలో నిరుద్యోగులతో మాట్లాడుతున్నారు.

ఒక్కొక్కరుగా వస్తూ వైయస్ షర్మిల ని  పలకరిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube