యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఉప్పెన సినిమా దర్శకుడు బుచ్చి బాబు ఒక సినిమా చేయబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.ఉప్పెన వంటి బిగ్గెస్ట్ సక్సెస్ ను దక్కించుకున్న దర్శకుడు బుచ్చి బాబుకు ఖచ్చితంగా ఎన్టీఆర్ తో సినిమా చేసే స్థాయి ఉంది.
కాని ఆయన ఈ సినిమాను చేయాలంటే చాలా సమయం పడుతుందని అంటున్నారు.ఎందుకంటే ఎన్టీఆర్ ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ సినిమా షూట్ లో ఉన్నాడు.
ఆ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమాను ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమాను చేయాల్సి ఉంది.ఈ రెండు సినిమాలు కాకుండా అట్లీ కూడా గతంలో ఎన్టీఆర్ తో సినిమాకు సిద్దం అయ్యాడు.
కాని కొన్ని కారణాల వల్ల అది వాయిదా పడింది.ప్రశాంత్ నీల్ మూవీ తర్వాత అట్లీ దర్శకత్వంలో సినిమా చేయాలని ఎన్టీఆర్ భావిస్తున్నాడట.
ఈ మూడు సినిమాలు పూర్తి అవ్వడానికి కనీసం రెండేళ్ల సమయం పడుతుందని అంటున్నారు.కనుక బుచ్చి బాబుతో సినిమా ను ఎన్టీఆర్ మొదలు పెట్టాలంటే ఎన్టీఆర్ రెండు సంవత్సరాల తర్వాత డేట్లు ఇస్తాడు.అప్పటి వరకు ఎన్టీఆర్ డేట్ల కోసం బుచ్చి బాబు వెయిట్ చేస్తాడా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది.పెద్ద ఎత్తున అంచనాలున్న సినిమాలు కనుక ఖచ్చితంగా టైమ్ తీసుకుంటారు.
కనుక రెండేళ్లకు ఎక్కువ అయినా ఆశ్చర్యం లేదు.కనుక బుచ్చి బాబు అప్పటి వరకు వెయిట్ చేస్తాడా అనే ప్రశ్న ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల వారిని తొలుస్తోంది.
బుచ్చి బాబు ఈ గ్యాప్ లో రెండు సినిమాలు చేసే అవకాశం ఉంటుంది.కాని మరి బుచ్చి బాబు ఆ చిన్న సినిమాల ఫలితం తారు మారు అయితే ఎన్టీఆర్ తో సినిమా చేసే అవకాశం కోల్పోతాడు.
మరి ఈ సమయంలో బుచ్చి బాబు నిర్ణయం ఏంటీ అనేది చూడాలి.అందరి దృష్టి బుచ్చి బాబు తదుపరి సినిమా పై ఉంది.