భారతీయులను వరిస్తున్న యూఏఈ “గోల్డెన్ వీసాలు”....

అన్ని దేశాలు తమ దేశంలో ఉండే విదేశీయులకు శాశ్వత నివాసం కోసం వీసాలను రూపొందిస్తాయి.అమెరికా గ్రీన్ కార్డ్ ద్వారా వలస వాసులను శాశ్వతంగా తమ దేశంలోకి అనుమతిస్తే యూఏఈ గోల్డెన్ వీసా ద్వారా దీర్ఘకాలికంగా తమ దేశంలో ఉండేలా గోల్డెన్ వీసాను రూపొందించింది.

 Indian Nris Got Uae Golden Visa's , American Green Card, Uae Golden Visa, Saad M-TeluguStop.com

ఈ వీసాలను అత్యంత నిపుణులైన వారికి అందిస్తుంది.అలాగే తమ దేశంలో విద్య, వైద్యం, వ్యాపార, శాస్త్ర సాంకేతిక రంగాలలో ప్రతిభ కనబరించిన వారికికి కూడా ఈవీసాలను అందజేస్తుంది.

ఈ క్రమంలో గడిచిన కొన్ని రోజులుగా యూఏఈ పలువురు ప్రవాస భారతీయులకు గోల్డెన్ వీసాలను అందిస్తోంది.ఇప్పటి వరకూ యూఏఈ ఇచ్చిన గోల్డెన్ వీసాలలో భారతీయులే అత్యధికులు ఉండటం గమనార్హం.

తాజాగా భారత సంతతికి చెందిన ఇద్దరు ప్రముఖులకు గోల్డెన్ వీసాలు అందించింది.వీరిలో ఒకరు ప్రఖ్యాత మ్యూజిషియాన్ నిఖిముఖి కాగా, మరొకరు ఫైనాన్స్ రంగంలో అత్యంత నిపుణులైన సాద్ మనియర్.

నిఖిముఖి దుబాయ్ లో ప్రఖ్యాత మ్యూజిషియన్, భారత మూలాలు ఉన్న వ్యక్తి, పుట్టింది పెరిగింది యూఏఈ లోనే.తమ అద్భుతమైన ప్రదర్సనతో ఆకట్టుకునే ఆయన దాదాపు 50 పైగా నగరాలలో ప్రదర్సనలు ఇస్తూ అందరి అభిమానాన్ని చొరగోన్నారు.

దాంతో ఆర్ట్స్ అండ్ కల్చర్ విభాగంలో ఆయనకు గోల్డెన్ వీసా అందించారు.

ఇక ఎకనామిక్ కేటగిరీ లో సాద్ మనియర్ కు గోల్డె వీసా అందించింది ప్రభుత్వం.

దుబాయ్ లోని ప్రముఖ అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్ సంస్థ అయిన క్రొవ్ లో పనిచేస్తున్నారు.కొన్ని నెలల క్రితం ఆర్ధిక మంత్రిత్వశాఖ నుంచీ ఫోన్ కాల్ వచ్చిందని, తనను గోల్డెన్ వీసాకు ఎంపిక చేస్తున్నట్టుగా తెలిపారని, అన్ని వివరాలు తీసుకున్న తరువాత కేవలం రెండు నెలల వ్యవధిలో గోల్డెన్ వీసా అందించారని, యూఏఈ కి తాను ఋణపడి ఉంటానని ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

ఇదిలాఉంటే ఇప్పటి వరకూ యూఏఈ అందించిన గోల్డెన్ వీసాలలో అత్యదుకులు భారత సంతతి ప్రముఖులు కాగ వారిలో అత్యధికంగా వైద్య రంగ నిపుణులు ఉండటం విశేషం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube