గడిచిన కొన్ని సంవత్సరాలుగా వరుసగా సీరియళ్లలో నటిస్తూ నటిగా శృతిదాస్ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు.ప్రస్తుతం శృతిదాస్ దశేర్ మాతీ అనే సీరియల్ లో ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.
అయితే కొంతమంది నెటిజన్లు శృతిదాస్ ను దారుణంగా ట్రోల్ చేశారు.సీరియల్ డైరెక్టర్ తో డేటింగ్ లో ఉండటం వల్లే శృతిదాస్ కు ఆఫర్లు వస్తున్నాయని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
మరికొందరు శృతిదాస్ కమిట్ మెంట్ ఇచ్చి ఉంటారని కమిట్ మెంట్ ఇవ్వకపోతే ఆమెకు సీరియల్ ఆఫర్లు ఎలా వస్తాయంటూ కామెంట్లు చేస్తున్నారు.మరి కొందరు నెటిజన్లు నీలాంటి శరీర రంగు ఉన్నవాళ్లకు పాడుపనులు చేస్తే మాత్రమే ఆఫర్లు వస్తాయని పేర్కొన్నారు.
శృతిదాస్ నటిస్తున్న దశేర్ మాతీ సీరియల్ లో ఉన్న మరో ఇద్దరు నటీమణులతో పోలుస్తూ నెటిజన్లు శృతిని ట్రోల్ చేస్తూ ఉండటం గమనార్హం.
గడిచిన రెండు సంవత్సరాలుగా నెటిజన్ల నుంచి తీవ్రస్థాయిలో ట్రోల్స్ ఎదురవుతూ ఉండటంతో శృతి ఆ ట్రోల్స్ విషయంలో విసుగు చెందారు.పోలీసులను సంప్రదించి ఆన్ లైన్ లో తనను వేధింపులను గురి చేస్తున్న వాళ్లపై ఆమె ఫిర్యాదు చేశారు.నల్లగా ఉన్న అమ్మాయినని, బ్లాక్ బోర్డ్ అని కొంతమంది కామెంట్లు చేస్తున్నారని తనను కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని ఆమె పేర్కొన్నారు.
మరి కొందరు తాను డైరెక్టర్ తో రిలేషన్ షిప్ లో ఉన్నానని ప్రచారం చేస్తున్నారని తాను ప్రతిభ వల్లే ఈ స్థాయిలో ఉన్నానని ఆమె చెప్పుకొచ్చారు.ప్రేక్షకులు ఆదరించని పక్షంలో ఎవరూ ఆఫర్లు దక్కించుకోలేరని ఆమె చెప్పుకొచ్చారు.శృతిదాస్ పై ఇకపైనేనా ట్రోల్స్ ఆగుతాయేమో చూడాల్సి ఉంది.శృతిదాస్ తో మరికొందరు సీరియల్ నటులకు కూడా ఈ తరహా ట్రోల్స్ ఎదురవుతున్నాయి.దశర్ మాతీ సీరియల్ లో శృతిదాస్ టీచర్ పాత్రలో నటిస్తుండటం గమనార్హం.