టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ చిత్రాల్లో ఆర్ఆర్ఆర్ ఎలాంటి క్రేజ్‌ను ఏర్పాటు చేసుకుందో అందరికీ తెలిసిందే.స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
ఇక ఈ సినిమాతో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపాలని జక్కన్న ప్లాన్ చేస్తున్నాడు.కాగా ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ఇక ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా, తారక్ కొమురం భీం పాత్రలో విధ్వంసం సృష్టించనున్నాడు.అయితే ఇప్పటికే వారి పాత్రలకు సంబంధించిన పోస్టర్స్, టీజర్‌లు రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.
అయితే ఈ పోస్టర్స్ అండ్ టీజర్లకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుండటంతో, ఇవి సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి.ఇప్పటికే రామరాజు, కొమురం భీం పాత్రలకు సంబంధించిన టీజర్‌లకు స్టన్నింగ్ వ్యూస్ రావడం మనం చూశాం.
కాగా తాజాగా తారక్ కొమురం భీం పాత్రకు సంబంధించిన పోస్టర్ కూడా అదిరిపోయే రికార్డును క్రియేట్ చేసింది.
భీం పాత్రకు సంబంధించిన తారక్ ఫెరోషియస్ పోస్టర్‌కు ట్విట్టర్‌లో అత్యధిక కామెంట్లు వచ్చాయి.2020 మేలో ఈ పోస్టర్‌ను రిలీజ్ చేయగా, ట్విట్టర్‌లో అత్యధిక కామెంట్లు వచ్చిన తెలుగు చిత్ర పోస్టర్‌గా ఇది నిలిచింది.ఈ పోస్టర్‌కు ఏకంగా 2 లక్షల కామెంట్లు రావడం విశేషమని చెప్పాలి.
ఇలాంటి రికార్డును తమ అభిమాన హీరో నెలకొల్పాడని తారక్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ చేసుకుంటున్నారు.ఇక ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ నెలలో రిలీజ్ చేసేందుకు జక్కన్న అండ్ టీమ్ రెడీ అవుతున్నారు.