పెట్టె పట్టుకుని రెండు కిలోమీటర్లు నడిచిన అలీ.. ఏమైందంటే..?

బాలనటుడిగా కెరీర్ ను మొదలుపెట్టిన అలీ కొన్ని సినిమాల్లో కమెడియన్ గా మరికొన్ని సినిమాల్లో హీరోగా నటించారు.

హీరోగా సినిమాలు చేసి కూడా కమెడియన్ గా సక్సెస్ సాధించిన అతికొద్ది మందిలో అలీ ఒకరని చెప్పవచ్చు.

ఏ పాత్ర ఇచ్చినా ఆ పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేయడానికి అలీ ప్రయత్నిస్తారు.మద్రాస్ లో ఉన్న సమయంలో అలీ పడిన కష్టాలు అన్నీఇన్నీ కావు.

అలీకి మంచి పేరు తెచ్చిపెట్టిన సినిమాలలో ప్రేమఖైదీ ఒకటి.ఆ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన అనుభవాలను అలీ ఒక సందర్భంలో పంచుకున్నారు.

మద్రాస్ తో పోల్చి చూసినప్పుడు హైదరాబాద్ లో తాను పడిన కష్టాలు కష్టాలే కాదని అలీ చెప్పుకొచ్చారు.ఆ సమయంలో మద్రాస్ లో ఎవరైతే స్ట్రగుల్ అవుతారో వారు మాత్రమే స్టార్ అవుతారని చెప్పేవారని అలీ పేర్కొన్నారు.

Advertisement

మద్రాస్ లో ఆరు నెలలు బన్నూ టీతో గడిపానని అలీ వెల్లడించారు.తన దగ్గర డబ్బులు లేకపోయినా ఎవరినీ అడిగేవాడిని కాదని అలీ చెప్పుకొచ్చారు.

ఇంట్లో అడిగితే డబ్బులు ఇస్తారని తెలిసినా అడగడం తనకు ఇష్టం లేదని అలీ తెలిపారు.ప్రైమఖైదీ మూవీ షూటింగ్ కొరకు హైదరాబాద్ కు వెళ్లాల్సి ఉందని నేను వెళ్లాల్సిన రైలు వెళ్లిపోవడంతో ఛార్మినార్ ఎక్స్ ప్రెస్ లో వెళ్లానని సికింద్రాబాద్ స్టేషన్ కు కొంత దూరంలో రిజర్వేషన్ల చెకింగ్ వల్ల రైలు ఆగిందని అలీ అన్నారు.

ఆ సమయంలో పట్టాలపై రెండు కిలోమీటర్ల కంటే ఎక్కువదూరం నడుచుకుంటూ వెళ్లానని అలీ చెప్పుకొచ్చారు.పెట్టె పట్టుకుని రెండు కిలోమీటర్లు నడిచిన అలీ తర్వాత ఆటోలో జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర దిగిపోయి చిత్రబృందాన్ని కలుసుకున్నారు.ప్రస్తుతం అలీ స్టార్ కమెడియన్ గా ఒక వెలుగు వెలుగుతున్న సంగతి తెలిసిందే.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు