ప్రస్తుత జనరేషన్ లో ఉన్న యువకులు కొందరు వారి తల్లిదండ్రులను ఎదిరించి మరీ ప్రేమ పెళ్లిళ్లు చేసుకుంటున్న సంఘటనలు మనం తరచూ మీడియా ద్వారా చూస్తూనే ఉంటాం.ఇందులో కొందరు ఇంట్లో వారిని ఒప్పించి కుటుంబ సభ్యుల మధ్య వివాహం చేసుకుంటే.
మరికొందరు పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవడం లాంటి విషయాలు కూడా తరచుగా వింటూనే ఉంటాం.అయితే తాజాగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఓ అమ్మాయి అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అబ్బాయి అమెరికాలో ప్రేమించి పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు.
అయితే ఇందులో పెద్ద విషయం ఏముంది అని అనుకుంటున్నారు కదా.అయితే అసలు విషయంలోకి వెళితే.
కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచ నలుమూలల ఎన్నో రంగాలకు సంబంధించి మార్పులు సంభవించిన సంగతి తెలిసిందే.ఇక బంధువుల, స్నేహితుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగే పెళ్ళిళ్ళు కూడా కేవలం అతి కొద్ది మంది సమక్షంలో జరగడం మనం గమనిస్తూనే ఉన్నాం.
ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో నివసిస్తున్న కొత్తపల్లి కృష్ణారావు, వాణిశ్రీ దంపతుల కుమార్తె శ్రీజఅలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు నగరానికి చెందిన రవి, పద్మల కుమారుడు కృష్ణతేజ ఇద్దరు అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లి అక్కడే చదువు పూర్తి చేసుకొని మంచి ఉద్యోగాలలో స్థిరపడ్డారు.అయితే చదువుకున్న సమయంలోనే వారి పరిచయం కాస్త ప్రేమగా పని చివరికి వారి వివాహానికి దారితీసింది.
ఈ నేపథ్యంలో ఇరు కుటుంబ సభ్యులు వారి పెళ్లిని అంగీకరించారు.దాంతో వారి పెళ్లికి సంబంధించిన ముహూర్తం కూడా నిర్ణయించారు.అయితే.ప్రస్తుతం కరోనా నేపథ్యంలో భాగంగా అమెరికా నుండి భారత్ కి వచ్చే పరిస్థితులు లేవు.
దీంతో వధూవరులు ఇద్దరూ వారి వివాహాన్ని అమెరికాలో అదే ముహూర్తానికి జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు.అయితే దురదృష్టవశాత్తు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో వారి తల్లితండ్రులు అమెరికాకు వెళ్లలేక నేపథ్యంలో వారు భారత్ లోనే ఉండి అమెరికాలో జరుగుతున్న వారి పిల్లల వివాహ వేడుక ఆన్లైన్ లో చూసి వారిని ఆశీర్వదించారు.ఈ పెళ్లిని అమ్మాయి పెళ్ళి వారు వారి నిజామాబాదులో అలాగే పెళ్ళికొడుకు వారు గుంటూరులో ఎల్ఈడి స్క్రీన్ లలో వారి పిల్లల వివాహాన్ని చూసుకొని వారిని ఆశీర్వదించునట్లు తెలియజేశారు.