నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని డైరక్షన్ లో ఓ సినిమా వస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమా కోసం మరోసారి ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథను ఎంచుకున్నాడు గోపీచంద్.
క్రాక్ సినిమాతో హిట్ అందుకున్న గోపీచంద్ మలినేని మరోసారి అదే వేటపాలెం బ్యాక్ డ్రాప్ తో బాలయ్య సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది.ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా మెహ్రీన్ కౌర్ ను తీసుకుంటారని టాక్.
సీనియర్ హీరోలతో నటించడానికి యువ హీరోయిన్స్ నటించడానికి ఆసక్తి చూపించరు కాని మెహ్రీన్ మాత్రం ఏకంగా బాలయ్య బాబుతో రొమాన్స్ కు సై అంటుంది.అయితే గోపీచంద్, బాలకృష్ణ సినిమాకు హీరోయిన్ గా మెహ్రీన్ ను అడిగారు కాని ఆమె నుండి ఎలాంటి రెస్పాన్స్ రాలేదని అంటున్నారు.
మరి బాలకృష్ణతో మెహ్రీన్ కౌర్ రొమాన్స్ కు సై అంటుందా లేదా అన్నది త్వరలో తెలుస్తుంది.ఈమధ్యనే ఎంగేజ్మెంట్ జరుపుకున్న మెహ్రీన్ కౌర్ సినిమాలకు కూడా ఓకే చెబుతుంది.
పెళ్లికి ఇంకా టైం ఉందని ఆమె సైన్ చేసిన సినిమాలన్ని కంప్లీట్ చేయాలని చూస్తుంది.బాలకృష్ణ సినిమా ఓకే చేస్తే మాత్రం మెహ్రీన్ కౌర్ మళ్లీఎ కెరియర్ లో ఫాం లోకి వచ్చే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.