పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ వకీల్ సాబ్ సినిమాతో వెండితెరపై కనిపించారు.అంతేకాదు వరస సినిమాలను ఒప్పుకుంటూ ఎప్పుడూ లేనంత ఫాస్ట్ గా సినిమాలను పూర్తి చేస్తున్నాడు.
వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేసిన వకీల్ సాబ్ సినిమాతో మరొకసారి తన స్టామినా నిరూపించుకున్నాడు.ప్రస్తుతం పవన్ క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తున్నాడు.
ఈ సినిమా ఇప్పటికే 40 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.కరోనా కారణంగా ప్రస్తుతం షూటింగ్ ను వాయిదా వేశారు.ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతుండడంతో మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేసే ఆలోచలంలో ఉన్నాడు క్రిష్.ఈ సినిమాలో పవన్ కు జోడీగా నిధి అగర్వాల్ నటిస్తుంది.
ఇప్పటికే విడుదల ఆయిన ఫస్ట్ లుక్ పోస్టర్ లో పవన్ లుక్ అందరిని ఆకట్టుకుంది.
పవన్ ఈ సినిమా తో పాట అయ్యప్పనుమ్ కోషియంఅనే రీమేక్ సినిమాలో కూడా నటిస్తున్నారు.ఈ సినిమాలో పవన్ తో పాటు దగ్గుబాటి రానా కూడా ప్రధాన నటిస్తున్నాడు.ఈ సినిమా యంగ్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తున్నాడు.
ఈ సినిమా షూటింగ్ కూడా చాలా వరకు పూర్తి చేసారు.కరోనా కారణంగా వాయిదా పడ్డ ఈ సినిమా మళ్ళీ రీస్టార్ట్ అవ్వడానికి ముహూర్తం ఫిక్స్ చేసారు మేకర్స్.
లేటెస్ట్ గా వినిపిస్తున్న వార్త ప్రకారం ఈ సినిమాను జులై 11 నుండి రీస్టార్ట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది.ఈ సినిమాకు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే మరియు మాటలు అందిస్తున్నాడు.ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మిస్తున్నారు.థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు.ఈ సినిమాలో పవన్ కు జోడీగా నిత్యా మీనన్ ను ఫిక్స్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి.మరి చూడాలి ఈ రీమేక్ సినిమా ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుంటుందో.