అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది.ఆయనకు అత్యంత ఇష్టమైన పెంపుడు కుక్క ‘‘ఛాంప్’’ (13) శనివారం మరణించింది.
‘‘ తాము బాధలో వున్న రోజుల్లోనూ.ఆనందంగా వున్న సమయంలోనూ ఛాంప్ మా వెంటే వుందని, మా భావోద్వేగాల్లోనూ భాగస్వామి అయ్యిందని’’ బైడెన్ దంపతులు గుర్తుచేసుకున్నారు.
‘‘ఛాంప్ చిన్నతనంలో నావల్ అబ్జర్వేటరీ ముందు గార్డెన్‌లో గోల్ఫ్ బంతులను వెంబడించడం, డెలావర్‌లోని తమ ఇంటి ఆవరణలో మా మనవరాళ్లను పట్టుకోవడానికి పరిగెత్తేవాడని బైడెన్ దంపతులు ఓ ప్రకటనలో తెలిపారు.
జర్మన్ షెపర్డ్ జాతికి చెందిన ఛాంప్.2008లో ఆయన అమెరికా ఉపాధ్యక్షుడిగా వున్న సమయంలో ఓ జంతువుల వ్యాపారి నుంచి బైడెన్ ‘‘ఛాంప్’’ను కొనుగోలు చేశారు.జంతు ప్రేమికుడైన ఆయనకు జర్మన్ షెపర్డ్ జాతికే చెందిన మరో కుక్క ‘‘ మేజర్’’ కూడా వుంది.
ప్రస్తుతం ఛాంప్ మృతితో మేజర్ ఒంటరి అయ్యింది.డొనాల్డ్ ట్రంప్ నాలుగేళ్ల పరిపాలనలో వైట్ హౌస్‌లో పెంపుడు జంతువులకు స్థానం లేకుండా పోయింది.
అయితే బైడెన్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పెంపుడు జంతువులకు శ్వేతసౌధంలో మళ్లీ స్థానం లభించింది.
కొద్దిరోజుల క్రితం అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా పెంపుడు కుక్క ‘‘బో’’ క్యాన్సర్‌తో కన్నుమూసిన సంగతి తెలిసిందే.
ఒబామా తన కుమార్తెలు మాలియా, సాషాకు 2008 ఎన్నికల తర్వాత కుక్కపిల్లను ఇస్తానని వాగ్థానం చేశారు.ఇచ్చిన మాట ప్రకారం.అధ్యక్షుడిగా గెలిచి వైట్‌హౌస్‌లో అడుగుపెట్టిన వెంటనే ఒబామా కుటుంబంలో ‘‘బో’’ ఒక భాగమైంది.శ్వేతసౌధంలో ఒబామా కుక్కతో ఆడుకుంటున్న ఫోటోలు, వీడియోలు అప్పట్లో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.
‘బో’’ బ్లాక్ అండ్ వైట్ పోర్చుగీస్ జాతికి చెందిన వాటర్ డాగ్.దీనిని సెనేటర్ ఎడ్వర్డ్ కెన్నడీ .ఒబామాకు బహుమతిగా అందజేశారు.ఒబామా హయాంలో వైట్‌హౌస్‌లోని అన్ని ముఖ్య కార్యక్రమాల్లో ‘‘బో’’ సందడి చేసేది.
వార్షిక ఈస్టర్ ఎగ్ రోల్ సమయంలో పోప్‌ను కలవడం, ఆసుపత్రిలో పిల్లలతో ఆడుకోవడంతో పాటు అధ్యక్షుడి అధికారిక విమానం ఎయిర్‌ఫోర్స్ వన్‌లో సైతం ప్రయాణించింది.