టాలీవుడ్ ఇండస్ట్రీలోని డైరెక్టర్లలో రామ్ గోపాల్ వర్మ రూటే వేరనే సంగతి తెలిసిందే.ఈ మధ్య కాలంలో సక్సెస్ లేకపోయినా ఏదో ఒక విధంగా రామ్ గోపాల్ వర్మ వార్తల్లో నిలుస్తున్నారు.
తాజాగా ఆర్జీవీ బిగ్ బాస్ బ్యూటీ అరియానాకు బోల్డ్ ఇంటర్వ్యూ ఇచ్చారు.ఈ ఇంటర్వ్యూలో ఆర్జీవీ గతంలో అరియానాతో ఆర్జీవీకి ఎఫైర్ ఉందని వైరల్ అయిన వార్తల గురించి స్పందించి స్పష్టతనిచ్చారు.
గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలతో పోలిస్తే భిన్నంగా ఆర్జీవీ ఇంటర్వ్యూను ప్లాన్ చేశారు.
ఆర్జీవీతో ఇంటర్వ్యూ చేయడం వల్లే అరియానాకు బిగ్ బాస్ ఛాన్స్ వచ్చిందనే సంగతి తెలిసిందే.
తాజా ఇంటర్వ్యూలో ఆర్జీవీ అరియానా అందాన్ని తెగ పొగిడేశారు.అరియానా తాను చేసే కామెంట్లను స్పోర్టివ్ గా తీసుకుంటారని ఆ రీజన్ వల్లే అరియానాకు తాను పడిపోయానని ఆర్జీవీ వెల్లడించారు.
అరియానా జిమ్ లోకి వచ్చిన తరువాత అరియానా థైస్ గొప్ప క్యాస్టూమ్ అని ఆర్జీవీ వెల్లడించారు.
కొంతమంది తనకు వర్మకు ఎఫైర్ ఉందని కామెంట్లు చేస్తున్నారని అరియానా చెప్పగా మంచి స్నేహాన్ని ఎవరూ కూడా తట్టుకోలేరని వర్మ అన్నారు.
ఆ విధంగా అనుకోని పక్షంలో సోషల్ మీడియాలో ఉండేవాళ్లకు నిద్ర పట్టదని వెల్లడించారు.అటువంటి వాళ్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆర్జీవీ పేర్కొన్నారు.మనం చేసేది మనమే చేయాలని వాళ్లు చేసేది వాళ్లు చేస్తారని ఆర్జీవీ తెలిపారు.
అబ్బాయితో అమ్మాయి ఉంటే తప్పుగా భావిస్తారని ఆర్జీవీ అన్నారు.అలా ఎవరైనా తప్పుగా అనుకుంటే ఏ విధంగా స్పందించాలని అరియానా అడగగా ఎవరి ఇష్టం వచ్చింది వాళ్లు చేయాలని ఆర్జీవీ తెలిపారు.అరియానా ఈ ఇంటర్వ్యూలో ఎన్నో అంశాల గురించి మాట్లాడారు.
బోల్డ్ ఇంటర్వ్యూలను ఇష్టపడేవాళ్లకు ఆర్జీవీ ఇంటర్వ్యూ కచ్చితంగా నచ్చుతుందని చెప్పవచ్చు.