టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా చిత్రీకరణ ముగింపు దశకు వచ్చింది.అన్ని అనుకున్నట్లుగా జరిగితే సినిమా మరో రెండు నెలల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేది.
కాని కరోనా సెకండ్ వేవ్ కారనంగా మొత్తం ప్లాన్ రివర్స్ అయ్యింది.సినిమా ను వచ్చే ఏడాది సమ్మర్ కు లేదా జులై కి వాయిదా వేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి.
కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సినిమా విడుదల వాయిదా నిజమే కాని వచ్చే ఏడాది సమ్మర్ వరకు కాదు అని తేలిపోయింది.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ను వచ్చే ఏడాది రిపబ్లిక్ డే సందర్బంగా విడుదల చేయబోతున్నారు.
ఇప్పటికే షూటింగ్ ముగింపు దశకు వచ్చింది కనుక విడుదల తేదీని అనుకూల తేదీని ఇప్పటికే నిర్ణయించారు.అధికారికంగా అతి త్వరలోనే ప్రకటించే అవకాశం ఉందంటున్నారు.
వరుసగా సినిమాకు సంబంధించిన షూటింగ్ ను ప్లాన్ చేస్తున్నారు.
ఆర్ ఆర్ ఆర్ సినిమా కోసం దాదాపుగా 45 నుండి 50 రోజుల పాటు షూటింగ్ ను చేయాల్సి ఉంది.
జులై 1 నుండి ఈ సినిమా షూటింగ్ మొదలు అవుతుంది.సినిమా ముగింపు దశకు వచ్చింది.కనుక ఆ సినిమా షూటింగ్ కు అందరు హాజరు అవ్వాలని నటీ నటులు అంతా కూడా ఫిక్స్ అయ్యారు.ఇటీవలే ఆలియా భట్ మాట్లాడుతూ నేను రాజమౌళి గారి పిలుపు కోసం వెయిట్ చేస్తున్నాను.
ఆయన ఎప్పుడు ఆహ్వానిస్తే అప్పుడే వెళ్లి తన పార్ట్ పూర్తి చేస్తానంటూ చెప్పేసింది.

కనుక సినిమా నటీ నటులు అంతా కూడా సిద్దంగా ఉన్నారు.కరోనా కాస్త కనికరం చూపిస్తే సినిమా మొత్తం కూడా ఆగస్టు వరకు పూర్తి అయ్యే అవకాశం ఉందంటున్నారు.ఆగస్టులో సినిమా పూర్తి అయితే ఈజీగా వచ్చే ఏడాది రిపబ్లిక్ డే సందర్బంగా జనవరి 26న విడుదల చేసే అవకాశం ఉంటుంది.
మరి జక్కన్న ఇందుకు ఎలాంటి వ్యూహాలను అమలు చేస్తాడో చూడాలి.