మన దేశంలో చాలా మంది జంతు ప్రేమికులు ఉన్నారనే విషయం మన అందరికి తెలిసిందే.కుక్కల్ని, పిల్లులను పెంచుకోవడం మనం చూసే ఉంటాము.
అలా మానవుడు జంతువులను మచ్చిక చేసుకుని వాటితో విడదీయలేని సంబంధం కొనసాగిస్తున్నారు.కొందరు అయితే పక్షులను కూడా పెంచుకుంటూ ఉంటారు.
వాటిని తమ ఇంట్లో మనుషులు లాగా భావిస్తూ వాటికీ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించడం లాంటివి చూస్తూనే ఉన్నాము.జంతువులు అవ్వనివ్వండి, పక్షులు అవ్వనివ్వండి వాళ్ళ యజమానులు తప్పా మిగిలిన వాళ్ళు వాటి దగ్గరకు వస్తే దూరంగా పారిపోవడమో లేక ప్రతి ఘటించడమో చేస్తాయి.
అంతలా అవి వాటిని పెంచిన యజమానులను గుర్తు పెట్టుకుంటాయి.
కొందరు తమ పెంపుడు జంతువులకు ఇష్టమైన ఆహారం పెడుతూ ఉంటారు.
అవి తింటున్నప్పుడు, లేదంటే అవి ఎమన్నా చిలిపి పనులు, అరవడం లాంటివి చేసినప్పుడు వీడియో తీసి సోషల్ మీడియాలో ఆ వీడియో పోస్ట్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు.అయితే తాజాగా ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది.
మరి ఆ వివరాలు ఏంటో చూద్దామా.సాధారణంగా పక్షులు ఎవరికి అంత త్వరగా మచ్చిక అవ్వవు.
వాటిని పట్టుకోవాలని మనం చూసిన అవి తుర్మంటూ ఎగిరిపోతాయి.ఎందుకంటే మనుషులు వాటికి హాని కలిగిస్తాయేమో అనే భావన వలన అవి ఎగిరిపోతాయి.
అలవాటు ఉంటే తప్పా పక్షులు మానవులకు భయపడకుండా ఉంటాయి.అయితే మేఘరాజ్ దేశాలే అనే వ్యక్తి తన ఇన్‌స్టాగ్రామ్ లో ఓ వీడియో పోస్ట్ చేశారు.
ఈ వీడియోలో ఒక వ్యక్తి ఆకలి వేయడంతో అక్కడ దగ్గరలో ఉన్న ఒక హోటల్ లో భోజనం చేస్తున్నారు.అదే సమయంలో ఎక్కడ నుంచి వచ్చిందో తెలియదు గాని ఒక పక్షి వచ్చి అతను తింటున్న ప్లేస్ లోకి వచ్చి వాలింది.అక్కడితో ఆగకుండా, భయం బెరుకు లేకుండా అతని ఎదురుగా నుంచుని అతను తింటున్న ప్లేట్ లో ఉన్న ఆహారాన్ని తినడం మొదలు పెట్టింది.అయితే అతను కూడా పక్షిని అదిలించించకుండా అతను తింటున్న ప్లేట్ నుండి కొంత ఆహారాన్ని తీసి బల్ల మీద వేశాడు.
పాపం ఎంత ఆకలితో ఉందో బల్ల మీద వేసిన ఆహారం అంతా తిన్నాక మళ్ళీ అతని తినే ప్లేట్ లోని ఆహారం తినడం మొదలుపెట్టింది.ఇలా ఇద్దరూ కలిసి ఒకే ప్లేట్ లో భోజనం చేశారన్నమాట.
ప్రస్తుతం వీరిద్దరూ కలిసి భోజనం చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.