మాజీ మంత్రి ఈటెల రాజకీయం కొత్త పొంతలు తొక్కుతోంది.కేసీఆర్ తో విభేదించి కేసీఆర్ ఆగ్రహానికి గురై భర్తరఫ్ కు గురవడంతో తాజాగా బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.
అయితే బీజేపీలో చేరిక సందర్బంగా ఈటెల చెబుతున్న ఒకే ఒక మాట.అయితే ఇప్పుడు ఈటెల ఆత్మగౌరవ నినాదం అనేది ఇప్పుడు రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది.అయితే ఈటెల ను విమర్శిస్తున్న టీఆర్ఎస్ నేతలు టీఆర్ఎస్ లో లేని ఆత్మగౌరవం బీజేపీలో ఉందా అంటూ ఈటెలపై సెటైర్లు వేస్తున్న పరిస్థితి ఉంది.అయితే బీజేపీ రాజకీయం ఈటెల లాంటి వ్యక్తులకు ఎంత వరకు మింగుడు పడతాయనేది చూడాల్సి ఉంది.
అయితే కేసీఆర్ పై ఎలాంటి పోరాటం చేయనున్నడో త్వరలో ఈటెల తెలియజేసే అవకాశం ఉన్నప్పటికీ రకరకాల వార్తలు ఇప్పటికీ ప్రచారంలో ఉంటూ వస్తున్న పరిస్థితి ఉంది.

అయితే రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ఒక్కసారి మనం గమనిస్తే ఈటెల టీఆర్ఎస్ లో దక్కినంత గౌరవం మరెక్కడా దక్కదన్నది అదే విధంగా బీజేపీలో ఈటెల కు సముచిత స్థానం దక్కినా అది కొద్ది రోజులు మాత్రమే ఉన్నా ఆశ్చర్యపోని పరిస్థితి ఉంటుంది.బీజేపీ రాజకీయ విధానాలు పూర్తిగా ఈటెల రాజకీయ విధానానికి పూర్తిగా వ్యతిరేకం.