టాలీవుడ్ ఇండస్ట్రీలో మోడల్ గా, నటిగా మీనాక్షి చౌదరి తనకంటూ మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు.డాక్టర్ చదివి యాక్టర్ అయిన ఈ నటి హర్యానా రాష్ట్రంలోని పంచ్ కుల్ గ్రామానికి చెందిన వారు.
పంచ్ కుల్ గ్రామంలో డాక్టర్ చదివిన మొదటి వ్యక్తి మీనాక్షి చౌదరి కావడం గమనార్హం.మీనాక్షి చౌదరి తండ్రి ఆర్మీ ఆఫీసర్ గా పని చేసేవారు.
చిన్నప్పటి నుంచి ఆయన కూతురును క్రమశిక్షణతో పెంచారు.
చిన్నప్పటి నుంచే చదువుపై ఎంతో ఇష్టం ఉన్న మీనాక్షి చౌదరి నేషనల్ డెంటల్ కాలేజ్ లో చదువును పూర్తి చేశారు.
అయితే మీనాక్షి చౌదరి మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ ను రోల్ మోడల్ గా తీసుకుని 2018 సంవత్సరంలో హర్యానాలో జరిగిన ఫెమినా మిస్ ఇండియా కాంపిటీషన్ లో పాల్గొన్నారు.ఆందులో కిరీటాన్ని గెలుచుకున్న మీనాక్షి చౌదరి ఆ తరువాత వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం ఏర్పడలేదు.
ఆ తరువాత మిస్ ఇండియా పోటీలో పాల్గొని ఆ పోటీలో సైతం మీనాక్షి చౌదరి విజయం సాధించారు.
ప్రస్తుతం రవితేజ హీరోగా రమేష్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఖిలాడీ సినిమాలో మీనాక్షి హీరోయిన్ గా నటిస్తున్నారు.ఖిలాడీ సినిమా హిట్టైతే మీనాక్షికి నటిగా ఆఫర్లు పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు.ఈ సినిమాతో పాటు ఇచ్చట వాహనములు నిలపరాదు, హిట్ 2 సినిమాలలో మీనాక్షి హీరోయిన్ రోల్ లో నటిస్తున్నారు.
ఈ నటికి స్విమ్మింగ్ అంటే కూడా ఎంతో ఇష్టం.హర్యానాలో జరిగిన స్విమ్మింగ్ పోటీలతో పాటు బ్యాడ్మింటన్ పోటీలలో కూడా పాల్గొని మీనాక్షి పలుమార్లు ఆ పోటీల్లో విజేతగా నిలిచారు.మోడల్ గా కెరీర్ ను ప్రారంభించిన సమయంలో మేకప్ వేసుకోవడం కష్టంగా ఉండేదని ప్రస్తుతం తాను చిటికెలో మేకప్ వేసుకుని రెడీ అవుతున్నానని మీనాక్షి చౌదరి చెప్పుకొచ్చారు.