బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా విద్యాబాలన్ మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు.వయస్సు పెరుగుతున్నా విద్యాబాలన్ కు ఆఫర్లు మాత్రం తగ్గడం లేదు.
అయితే తాజాగా విద్యాబాలన్ లింగ వివక్ష గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆడవాళ్లు మాత్రమే వంట చేయాలని రూల్ ఉందా.? అంటూ విద్యాబాలన్ ప్రశ్నిస్తున్నారు.ఏ సమస్యపైనైనా స్పందించే విద్యాబాలన్ తాజాగా లింగవివక్ష గురించి మాట్లాడారు.
తన దృష్టిలో స్త్రీ, పురుషులకు బేధం లేదని ఇద్దరూ సమానమేనని విద్యాబాలన్ అన్నారు.వంటగదికే మాత్రమే స్త్రీలు పరిమితం అయ్యేవాళ్లు కాదని విద్యాబాలన్ చెప్పుకొచ్చారు.ఒక సమయంలో తన ఇంటికి బంధువులు వచ్చారని భోజనం చేసే సమయంలో వాళ్లు తనకు వంట రాదని ఎగతాళిగా మాట్లాడారని ఆమె చెప్పుకొచ్చారు.ఆ తరువాత తాను తన భర్తకు కూడా వంట రాదని చెప్పానని వెల్లడించారు.

అవతలి వ్యక్తి తనకు నువ్వు వంట నేర్చుకుంటే బాగుంటుంది అని సలహా ఇవ్వగా నేనే ఎందుకు వంట నేర్చుకోవాలని విద్యాబాలన్ ఎదురు ప్రశ్నించారు.తనకు, తన భర్తకు మధ్య తేడా ఎందుకుండాలని అడగగా అవతలి వ్యక్తి ఏం మాట్లాడలేదని విద్యాబాలన్ వెల్లడించారు.తాను చిన్న వయస్సు నుంచి అదే విధంగా ఉండేదానినని విద్యాబాలన్ పేర్కొన్నారు.అమ్మ వంట నేర్చుకోమని చెబితే వంటమనిషి ని పెట్టుకుంటానని ఆమెకు చెప్పానని విద్యాబాలన్ తెలిపారు.
అమ్మతో వంట వచ్చినవాడిని పెళ్లి చేసుకుంటానని చాలాసార్లు చెప్పానని విద్యాబాలన్ తెలిపారు.ప్రస్తుతం విద్యాబాలన్ షెర్నీ అనే సినిమాలో నటిస్తున్నారు.
ఈ సినిమాలో విద్యాబాలన్ ఫారెస్ట్ ఆఫీసర్ గా నటిస్తున్నారు.విద్యాబాలన్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతుండగా ఆమె కామెంట్స్ పై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమానార్హం.నెటిజన్లలో ఎక్కువమంది విద్యాబాలన్ చెప్పింది కరెక్ట్ అని చెబుతున్నారు.