మొదటి నుంచి వాళ్లది అదే బాధ ! జగన్ కు తీరిక లేదా ?

వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆ పార్టీలో నాయకులు బాధ ఒకటే.జగన్ తమను పట్టించుకోవడం లేదని, పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో ఎంతగానో శ్రమించి , పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చామని ,అయినా జగన్ తమకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదనే బాధ ఒకవైపు ఉండగా, రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ గ్రూప్ రాజకీయాలు పెద్ద ఎత్తున పెరిగిపోవడం , నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం , ఆధిపత్య పోరు తీవ్రంగా ఉండడం ఇలా ఎన్నో సమస్యలు నియోజకవర్గాల్లో పెరిగిపోయాయి.

 Ycp Leaders Are Mlas Who Are Worried That Jagan Will Not Care About Them, Ysrcp,-TeluguStop.com

పెద్ద ఎత్తున జగన్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న, ఆశించిన స్థాయిలో ప్రభుత్వానికి క్రెడిట్ రాకపోవడానికి నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలు ప్రధాన కారణంగా మారుతున్నాయి.

ఈ సమస్యలను పరిష్కరించేందుకు జగన్ ఎప్పటికప్పుడు ప్రయత్నాలు పార్టీ నాయకుల ద్వారా చేస్తున్న, ఫలితం మాత్రం పెద్దగా కనపడకపోవడం తో, వైసీపీ ప్రతి దశలోనూ అభాసుపాలు కావాల్సి వస్తోంది.

ఇదే ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీకి కలిసి వస్తోంది.నాయకుల మధ్య తగాదాలను ఉపయోగించుకుని తెలుగుదేశం బలపడేందుకు ప్రయత్నిస్తోంది .ఎప్పటికప్పుడు పార్టీ అగ్ర నాయకుల ద్వారా ఈ సమస్యను పరిష్కరించేందుకు జగన్ ప్రయత్నిస్తున్న, ఫలితం దక్కడం లేదు.పోనీ జగన్ స్వయంగా ఆ గ్రూప్ తగాదాలకు పాల్పడుతున్న నాయకులను స్వయంగా పిలిచి వార్నింగ్ ఇవ్వడం , లేదా ఫోన్ ద్వారా వారికి క్లాస్ పీకే అవకాశం ఉన్నా, జగన్ మాత్రం ఆ దిశగా అడుగులు వేయడం లేదు.

ఇక వైసీపీ ఎమ్మెల్యేల్లోనూ జగన్ తీరుపై అసంతృప్తి రేగుతోంది.గెలిచిన దగ్గర నుంచి జగన్ అపాయింట్మెంట్ ఇప్పటి వరకు తమకు దక్కలేదని, ఎన్నిసార్లు ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం కనిపించడం లేదని, ఇలా అయితే నియోజకవర్గ సమస్యల గురించి తాము ఎవరితో చెప్పుకోవాలి అని వైసీపీ మెజార్టీ ఎమ్మెల్యేలు వాపోతున్నారు.

Telugu Ap Cm Jagan, Ap, Chandrababu, Ysrcp, Ysrcp Mlas-Telugu Political News

ఎప్పటికప్పుడు జగన్ ఈ సమస్యలపై దృష్టి పెట్టి వ్యవహారాన్ని చక్క పెట్టించాలని చూస్తున్న ఫలితం మాత్రం కనిపించకపోవడంతో, వైసీపీ నాయకులు, ఎమ్మెల్యేల్లో తీవ్ర నిరాశా నిస్పృహలు అలుముకున్నాయి.అయినా జగన్ మాత్రం ప్రభుత్వ పథకాల అమలు వ్యవహారాలపై దృష్టి పెడుతున్నారు తప్ప, పార్టీని అధికారంలోకి తెచ్చిన నాయకులు ,ఎమ్మెల్యేలు, కార్యకర్తల గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు అనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube