మాస్ మహారాజా రవితేజ హీరోగా క్రాక్ సినిమా రూపొందిన సమయంలోనే త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో సినిమా కన్ఫర్మ్ అయ్యింది.క్రాక్ తర్వాత వెంటనే ఆ సినిమాను చేయాలనుకున్నాడు.
కాని రమేష్ వర్మ దర్శకత్వంలో సినిమా ను మొదలు పెట్టాడు.ఖిలాడీ సినిమా ముగింపు దశకు చేరుకుంది.
వెంటనే త్రినాధరావు సినిమా ను చేస్తాడని భావించారు.కాని ఇప్పుడు కొత్త దర్శకుడితో సినిమా ను మొదలు పెట్టాడు.
దాంతో త్రినాథ రావు నక్కిన దర్శకత్వం లో రవితేజ సినిమా ఉందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ఆ సమయంలోనే దర్శకుడు మరో హీరోతో సంప్రదింపులు జరిపినట్లుగా వార్తలు వచ్చాయి.
యంగ్ హీరోకు కథ చెప్పేందుకు ఆ దర్శకుడు సిద్దం అయ్యాడు అంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వెంటనే రవితేజ స్పందించాడని తెలుస్తోంది.మంచి కథను మిస్ చేసుకోవడం ఎందుకనే ఉద్దేశ్యంతో డేట్లు ఇచ్చేందుకు వెంటనే ఓకే చెప్పాడు.
త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో సినిమాను ఈ ఏడాది చివరి వరకు అనుకున్నారు.కాని రవితేజ ఆయన బెదిరింపుతో కాస్త వెనక్కు తగ్గినట్లుగా అనిపించింది.ఖిలాడీ పూర్తి అయిన వెంటనే కొత్త సినిమాను మొదలు పెట్టి దాంతో పాటు ఈ సినిమాను కూడా చేయాలనే ఉద్దేశ్యంతో రవితేజ ఉన్నాడు.
స్క్రిప్ట్ వర్క్ ను పూర్తి చేసి వెంటనే ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను కూడా పూర్తి చేయమని రవితేజ నుండి మెసేజ్ అందినట్లుగా త్రినాధరావు నక్కిన సన్నిహితులు చెబుతున్నారు.అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ ఏడాది ద్వితీయార్థం ప్రారంభంలోనే సినిమా పట్టాలెక్కి వచ్చే ఏడాది సినిమా ను వచ్చే ఏడాది ఆరంభంలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.రవితేజ తర్వాత మెగా హీరోతో త్రినాథ రావు నక్కిన మూవీ ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.