ఆ రేటింగ్‌ దృశ్యం 2 అంచనాలు మరింతగా పెంచేసింది

మలయాళ సూపర్‌ హిట్ దృశ్యం ను తెలుగులో వెంకటేష్‌ రీమేక్ చేసి సూపర్‌ హిట్‌ ను దక్కించుకున్న విషయం తెల్సిందే.దృశ్యంకు సీక్వెల్‌ గా దృశ్యం 2 వచ్చి సెన్షేషనల్‌ సక్సెస్‌ అయ్యింది.

 Telugu Drushyam 2 Movie Creating More Interest In Audience, Drushyam 2, Drushyam-TeluguStop.com

ఓటీటీ లో విడుదల అయిన దృశ్యం 2 కూడా మంచి విజయాన్ని నమోదు చేసిన నేపథ్యంలో తెలుగు లో సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి.ఇప్పటికే రీమేక్ షూటింగ్‌ ప్రారంభం అవ్వడం అయ్యింది.

ముగింపు దశకు కూడా వచ్చింది.అన్ని అనుకున్నట్లుగా జరిగి ఉంటే వచ్చే నెల లేదా జులై లో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉండేది.

కాని కరోనా వల్ల సినిమా ఆగిపోయింది.సినిమా షూటింగ్‌ ఆగిపోవడంతో పాటు విడుదల కూడా వాయిదా పడింది.

ఈ సమంయలో దృశ్యం 2 మలయాళం వర్షన్‌ టీవీలో టెలికాస్ట్‌ అయ్యింది.

మలయాళ దృశ్యం 2 కు భారీ గా రేటింగ్‌ దక్కింది.ఏకంగా 6.58 మిలియన్ ఇంప్రెషన్స్ ను ఈ సినిమా దక్కించుకున్నట్లుగా అధికారికంగా యూనిట్‌ సభ్యులు ప్రకటించారు.మలయాళం మూవీ ఆ రేంజ్‌ రేటింగ్‌ అంటే మామూలు విషయం కాదు.రికార్డు బ్రేకింగ్‌ ఇంప్రెషన్స్‌ ను దక్కించుకున్న దృశ్యం 2 సోషల్‌ మీడియాలో సందడి చేసి సినిమా పై అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి.

Telugu Drushyam, Drushyam Telugu, Jeetu Joseph, Malayalam, Meena, Mohan Laal, Tv

సినిమా షూటింగ్‌ ఎప్పుడెప్పుడు పూర్తి చేసి సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తారా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.దృశ్యం 2 సినిమా ను తెలుగులో వెంకటేష్‌ హీరోగా మీనా హీరోయిన్‌ గా జీతూ జోసెఫ్‌ తెరకెక్కిస్తున్నాడు.సురేష్‌ బాబు ఒరిజినల్‌ వర్షన్‌ నిర్మాతలతో కలిసి నిర్మిస్తున్నాడు.మొదటి పార్ట్‌ తో పోల్చితే రెండవ పార్ట్‌ అద్బుతం అంటూ అంతా నమ్మకంగా చెబుతున్నారు. కరోనా కాస్త సైలెంట్‌ అయితే ఆగస్టు లేదా సెప్టెంబర్‌ లో ఈ సినిమా విడుదల అయ్యేనో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube