స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మధ్య అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అన్న కళ్యాణ్ రామ్ ను నిర్మాతగా సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ కు తన తరువాత సినిమాలకు నిర్మాతగా వ్యవహరించే అవకాశం కూడా ఇస్తున్న సంగతి తెలిసిందే.
ఎన్టీఆర్ కరోనా బారిన పడగా ఈరోజే వైరస్ నుంచి కోలుకొన్నారు.కరోనా నెగిటివ్ వచ్చినట్టు ఎన్టీఆర్ ప్రకటించారు.
ఇకపోతే ఈ నందమూరి హీరోలకు సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతోంది.వైరల్ అవుతున్న ఫోటోలో లక్ష్మీ ప్రణతి, కళ్యాణ్ భార్య స్వాతి పక్కపక్కనే కూర్చుని ఉన్నారు.
సొంత అక్కాచెల్లెళ్లలా ప్రణతి, స్వాతి ఫోజు ఇవ్వగా ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతోంది.అన్నాదమ్ములే కాదు వారి భార్యలు కూడా చాలా అనుబంధంతో ఉండటం గమనార్హం.జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇండస్ట్రీలో సత్తా చాటుతున్నా ప్రణతి, స్వాతి మాత్రం సినిమా వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు.
భవిష్యత్తులో నిర్మాతగా ప్రణతి లేదా స్వాతి సినిమా రంగంలోకి ఎంట్రీ ఇస్తారేమో చూడాల్సి ఉంది.

కొన్ని రోజుల క్రితం ఎన్టీఆర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కథ నచ్చితే సినిమాలను నిర్మించే ఆలోచన తనకు ఉందని చెప్పుకొచ్చారు.రాబోయే రోజుల్లో ఎన్టీఆర్ నిర్మాతగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.అయితే దర్శకత్వం వైపు మాత్రం తనకు ఆసక్తి లేదని జూనియర్ ఎన్టీఆర్ తెలిపారు.
ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్.
ఆర్.ఆర్ సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాలో తన పాత్ర షూటింగ్ పూర్తి కాగానే ఎన్టీఆర్ కొరటాల శివ సినిమా పనులతో బిజీ కానున్నారు.ఈ సినిమా తరువాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ ఒక సినిమాలో నటించనున్నారు.మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనుంది.