దివి పాప కోసం మిల్కీ బ్యూటీ.. చిన్న హెల్ప్‌ పెద్ద ప్రయోజనం

తెలుగు ప్రేక్షకులకు దివి గురించి బిగ్ బాస్ సీజన్ 4 ముందు వరకు ఎవరికి తెలియదు.కాని ఎప్పుడైతే ఆమెకు బిగ్‌ బాస్ సీజన్‌ 4 లో ఆఫర్‌ వచ్చిందో అప్పటి నుండి ఆమె ఎవరు అనే విషయమై జనాలు చర్చించుకోవడం మొదలు పెట్టారు.

 Cab Stories Official Trailer Release By Tamanna, Big Boss, Cab Stories, Divi, Ta-TeluguStop.com

గతంలో కొన్ని సినిమాల్లో నటించిందా అంటూ ఆ తర్వాత ఆశ్చర్యంగా ఆ సినిమాల్లో సన్నివేశాలను చూసి ఆశ్చర్య పోయారు.సోషల్‌ మీడియాలో ముద్దుగుమ్మ దివికి పెద్ద ఫాలోయింగ్‌ ఉంది.

అలాంటి దివి నటించిన ‘క్యాబ్‌ స్టోరీస్‌‘ సినిమా రామ్‌ గోపాల్ వర్మ ఓటీటీ స్పార్క్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఇన్ని రోజులు ఆ సినిమా గురించి ఎక్కడ కూడా బయట చర్చ జరిగిందే లేదు.

కాని నేడు ఈ సినిమా ట్రైలర్‌ ను మిల్కీ బ్యూటీ తమన్నా విడుదల చేసింది.దాంతో ఒక్కసారిగా ఏంటీ ఈ క్యాబ్ స్టోరీస్‌ అంటూ నెట్టింట సెర్చ్‌ చేసే ప్రయత్నం చేస్తున్నారు.

పార్ట్‌ లుగా రాబోతున్న ఈ క్యాబ్‌ స్టోరీస్‌ కు ఇది మొదటి భాగంగా తెలుస్తోంది.మిల్కీ బ్యూటీ తమన్నా కొద్ది సేపటి క్రితం ఈ సినిమా ట్రైలర్‌ ను తన సోషల్ మీడియా వాల్‌ పై షేర్ చేసింది.

అంతే కాకుండా చాలా ఇంట్రెస్టింగ్‌ గా ఉందంటూ కూడా కామెంట్ పెట్టి లింక్ ను షేర్‌ చేసింది.ఈనెల 28 నుండి స్పార్క్‌ ఓటీటీ లో ఈ సినిమా ను స్ట్రీమింగ్‌ చేయండి అంటూ పేర్కొంది.

చిత్ర యూనిట్‌ సభ్యులందరికి కూడా ఆల్‌ ది బెస్ట్‌ చెప్పిన తమన్నా ట్వీట్‌ తో ఒక్కసారిగా క్యాబ్‌ స్టోరీస్ సినిమా పై అంచనాలు పెరిగి పోయాయి.దివి తో పాటు ఈ సినిమాలో షిహన్‌, ధన్‌ రాజ్‌ మరియు ప్రవీన్‌ లు కీలక పాత్రలో నటించాడు.

కామెడీతో పాటు హర్రర్‌ థ్రిల్లర్ ఎలిమెంట్స్ కూడా ఈ సినిమాలో పుష్కలంగా ఉంటాయని మేకర్స్ చెబుతున్నారు.స్పార్క్ ద్వారా విడుదల కాబోతున్న ఈ వెబ్‌ మూవీ కి మంచి టాక్ వస్తే దివి కి పెద్ద హీరోలతో నటించే అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube