ఏ రంగంలో నైనా మంచి ఎంత ఉంటుందో చెడు కూడా అంతే ఉంటుంది.కాని చెడును కొంత మంది చూస్తూ ఊరుకుంటారు.
కొంత మంది మాత్రం ప్రశ్నిస్తారు.ముఖ్యంగా మహిళల విషయంలోనే రకరకాల ఇబ్బందులు జరుగుతాయి.
కాని అలా సామాజిక విషయాలపై అవచ్చు.అలా ప్రతి విషయంలో స్పందిస్తుంది సింగర్ చిన్మయి.
సినిమాలను రెగ్యులర్ గా ఫాలో అయ్యే వారికి చిన్మయి పరిచయం అక్కరలేని పేరు.సినిమా పరిశ్రమలో జరుగుతున్న కాస్టింగ్ కౌచ్ విషయం అప్పట్లో పెద్ద వివాదం గా మారిన విషయం తెలిసిందే.
దానిపై స్పందించి సినిమా పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ విపరీతంగా ఉంది అని పెద్ద బాంబ్ పేల్చింది.అయితే తాజాగా నెటిజన్ పంపిన ఓ మెసేజ్ కు చిన్మయి ఎమోషనల్ అయింది.
ఇక ఆ సదరు నెటిజన్ మనకు జరిగే కొన్ని కొన్ని విషయాలను ఇంటి దగ్గర కూడా షేర్ చేసుకోలేము.కాని అటువంటి విషయాలను మేము మీతో చెప్పుకోగలుగుతున్నాం.
మీ మాటల ద్వారా మాలో ధైర్యాన్ని నింపావ్ .నీ మాటలు ఇంకా ఎంతో మంది యువకులకు ప్రేరణగా నిలవాలి అంటూ ఓ నెటిజన్ రాసిన మెసేజ్ కు చిన్మయి ఎమోషనల్ అయింది.ఇక ఈ మెసేజ్ పై చిన్మయి స్పందిస్తూ నా జీవితం సార్థకమైనట్టు అనిపిస్తుంది అంటూ ఎమోషనల్ అయింది.