ప్రతి యంగ్ హీరోకు సీనియర్ డైరరెక్టర్ తో సినిమా చేయాలని ఉంటుంది.అననుభవం ఉన్న ఉన్న దర్శకుడితో పనిచేయడం వల్ల మాస్ ఫాలోయింగ్ వస్తుందనేది వీరి ఆలోచన.
కానీ చాలా సార్లు యంగ్ హీరోలు-సీనియర్ దర్శకుల కాంబినేషన్ డిజాస్టర్లు మిగిల్చాయి.కొన్ని సార్లు మాత్రమే విజయాలు సాధించాయి.
ఎక్కువ సార్లు పరాజయాన్నే మూటగట్టుకున్నాయి.అలా ప్లాపులు మూటగట్టుకున్న సీనియర్ డైరెక్టర్-యంగ్ హీరో కాంబినేషన్లు ఏంటో ఇప్పుడు చూద్దాం.
నితిన్ – రాఘవేంద్రరావు
యంగ్ హీరో నితిన్, సినియర్ దర్శకుడు రాఘవేంద్ర రావు కలిసి అల్లరి బుల్లోడు సినిమా తీశారు.కానీ అనుకున్న విజయం సాధించలేదు.
అల్లరి నరేష్- కె విశ్వనాథ్
ఈ యంగ్-సీనియర్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా శుభప్రదం.ఈ సినిమా సైతం హిట్ కొట్టలేదు.
సునీల్- ఆర్జీవీ
టాలీవుడ్ యంగ్ హీరో సునీల్, సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కలిసి కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పల రాజు సినిమా తీసి చేతులు కాల్చుకున్నారు.
రానా- పూరీ జగన్నాథ్
వీరిద్దరు కలిసి నేను నా రాక్షసి సినిమా చేశారు.కానీ ఫ్లాప్ అయ్యింది.
సాయి ధరమ్ తేజ్- వివి వినాయక్
వీరి కాంబినేషన్ లో ఇంటెలిజెంట్ సినిమ వచ్చింది.ఇలా వచ్చి అలా వెళ్లిపోయింది.
వరుణ్ తేజ్- శ్రీను వైట్ల
వీరిద్దరు కలిసి మిస్టర్ సినిమా చేశారు.కానీ భారీ డిజాస్టర్ సొంతం చేసుకున్నారు.
రవితేజ- రవి రాజా పినిశెట్టి
వీరిద్దరు కలిసి వీడే అని సినిమా చేశారు.ఈ సినిమా విజయం సాధించలేదు.
జూ.ఎన్టీ ఆర్- బి గోపాల్
వీరి కాంబినేషన్ లో నరసింహుడు మూవీ చేసి అపజయం పాలయ్యారు.
శర్వానంద్- ఆర్జీవీ
వీరిద్దరు కలిసి సత్య-2 తీశారు.సినిమా బాగానే ఉన్నా సరైన విజయం సాధించలేదు.
సాయి ధరమ్ తేజ్- కరుణాకరణ్
వీరిద్దరి కాంబినేషన్ లో తేజ ఐ లవ్ యూ మూవీ చేశారు.కానీ అనుకున్న స్థాయిలో విజయం అందుకోలేదు.