కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న ఇలాంటి టైం లో త్వరలో జరగాల్సిన జేఈఈ మెయిన్స్ పరీక్షలను కూడా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో జరిగే జేఈఈ మెయిన్స్ పరీక్షలకు కరోనా అడ్డుగా మారింది.
సెకండ్ వేవ్ తీవ్రత అధికంగా ఉండటం వల్ల ఇప్పటికే స్కూల్స్, కాలేజీలు మూతపడ్డాయి.కామన్ పరీక్షలు సైతం కొన్నిచోట్ల రద్దు చేశారు.
మరికొన్ని రాష్ట్రాలు వాయిదా వేశారు.ఇలాంటి టైం లో జేఈఈ మెయిన పరీక్ష ని కూడా వాయిదా వేశారు.
అసలైతే ఈ నెల 24 నుండి 28 వరకు జేఈఈ మెయిన్స్ పరీక్ష జరగాల్సి ఉంది.అయితే కరోనా వల్ల షెడ్యూల్ ఫాలో అవడం కుదరని తెలుస్తుంది.
తీవ్రస్థాయిలో కరోనా వ్యాప్తి చెందుతుంది కాబట్టి పరీక్షని వాయిదా వేయడమే బెటర్ అని భావించి ఎన్.టి.ఏ జేఈఈ మెయిన్స్ పరీక్షలను వాయిదా వేసింది.అయితే పరిస్థితి కొద్దిగా చక్కబడ్డాక తదుపరి పరీక్షల తేడీలు వెళ్లడిస్తామని చెప్పారు.
ఎన్.టి.ఏ అభ్యాస్ యాప్ ద్వారా ఇంటి దగ్గర నుండే పరీక్షలకు సిద్ధమవ్వాలని సూచించారు.మొత్తానికి కరోనా ప్రభావం ఈ ఏడాది కూడా అన్ని పరీక్షల మీద ప్రభావం చూపిస్తుంది.
ఇప్పటికే విద్యార్ధులు పరీక్షల విషయంలో కన్ ఫ్యూజ్ అవుతున్నారు.ఒకసారి రద్ధు చేస్తున్నామని ఒకసారి వయిదా మాత్రమే మళ్లీ తదుపరి డేట్లను ప్రకటిస్తామని చెప్పారు.
ఇలాంటి టైం లో స్టూడెంట్స్ చాలా ఇబ్బందికి గురి అవుతున్నారు.