ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ సంచలన నిర్ణయాలు తీసుకున్న మంత్రిమండలి..!!

దాదాపు రెండు సార్లు ఏపీ క్యాబినెట్ సమావేశం తేదీ ఖరారై కరోనా నేపథ్యంలో రెండుసార్లు వాయిదా పడింది.ఈ క్రమంలో ప్రతిపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో ఈరోజు ఉదయం వెలగపూడి లో సీఎం క్యాంపు కార్యాలయంలో కేబినెట్ భేటీ జరిగింది.సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన మంత్రిమండలి సంచలన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.

 Ap Cabinet Highlight Decisions, Ap Cabinet Meeting, Ys Jagan, Ap Cabinet Meeting-TeluguStop.com

కేబినెట్ భేటీ నిర్ణయాలు:-

రేపటి నుండి రాష్ట్రంలో పాక్షిక కర్ఫ్యూను అమలు చేస్తున్న నేపథ్యంలో మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఆర్టీసీ సహా ప్రైవేటు వాహనాల రాకపోకలు రాష్ట్రంలో రాకుండా నిషేధం విధిస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది.  అదేవిధంగా కరోనా చికిత్స విషయంలో కీలక పాత్ర పోషిస్తున్న ఆక్సిజన్ కొరత సమస్య తీర్చడానికి ముందుగానే తమిళనాడు, కర్ణాటక, ఒడిశా నుంచి ఆక్సిజన్ సరఫరా జరిగేలా స్టాక్ ఉంచుకునేలా మంత్రిమండలి నిర్ణయం తీసుకోవడం జరిగింది. 

  1. అదేవిధంగా బీసీల రిజర్వేషన్లు మరో పదేళ్లు పొడిగించింది.

  2.  రైతు భరోసా కేంద్రాల ద్వారా రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి .రెండువేల ఎనిమిది వందల ఐదు కోట్ల రూపాయలు.రైతుల ఖాతాల్లో జమ చేయడానికి ఏపీ క్యాబినెట్  ఆమోదం తెలిపింది. 
  3. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న మత్స్యకారులకు వైయస్సార్ మత్స్యకార భరోసా పథకం కింద ప్రతి మత్స్యకార కుటుంబానికి పదివేల పరిహారం.

    అందించాలని సమావేశంలో నిర్ణయించుకున్నారు.ఈ నెల మే 18 వ తారీఖున రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఒక లక్షా 460 మంది మత్స్యకారులను ఆదుకోవడానికి ప్రభుత్వం రెడీ అయ్యింది.

  4. ఎలక్ట్రానిక్‌ పాలసీతో పాటు ప్రభుత్వ స్కూళ్లలో సీబీఎస్‌ఈ సిలబస్‌ అమలుకు అవగాహన ఒప్పందం చేసుకోవడంపైన, రాష్ట్రంలో కోవిడ్‌–19 నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై తీసుకుంటున్న చర్యలపై కూడా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.
  5. అర్చకులకు పది వేల నుంచి 15 వేల గౌరవ వేతనం పెంచాలని బి కేటగిరీ ఆలయాల్లో ఐదు వేల నుంచి పది వేల రూపాయల గౌరవ వేతనం అందించాలని ఏపీ ప్రభుత్వం డిసైడ్ అయింది.

    ముస్లిం ఇమామ్ లకు 5 వేల నుంచి పదివేల గౌరవ వేతనం పెంచాలని.మౌజమ్ లకు మూడు వేల నుంచి 5000 గౌరవ వేతనం అందించాలని.

    మంత్రిమండలి తీర్మానం తీసుకుంది. 

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube