మొటిమలు వచ్చాయంటే చాలు.వాటిని ఎలా తగ్గించుకోవాలో తెలియక తెగ సతమతమవుతుంటారు.
ఈ క్రమంలోనే ఒత్తిడి మరింత పెరుగుతుంది.దాంతో మొటిమలు కూడా మరింత పెరిగిపోతాయి.
అందుకే మొదట ఒత్తిడిని కంట్రోల్లో ఉంచుకోండి.ఇక మొటిమలంటారా.
వాటిని తగ్గించుకునేందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయి.ముఖ్యంగా జామాకులు మొటిమలను నివారించడంలో అద్భుతంగా సహాయపడతాయి.
మరి జామాకులను ఎలా ఉపయోగించాలి అన్నది ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా కొన్ని జామ ఆకులను తీసుకుని కడిగి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఆ పేస్ట్‌లో చిటికెడు పసుపు మరియు నిమ్మ రసం కలిపి మొటిమలు ఉన్న చోట అప్లై చేసి.అర గంట పాటు వదిలేయాలి.అనంతరం గోరు వెచ్చని నీటితో చర్మాన్ని శుభ్రం చేసుకోవాలి.ఇలా ప్రతి రోజు చేస్తే.
మొటిమలు మటుమాయం అవుతాయి.
అలాగే ఒక గిన్నె తీసుకుని అందులో జామ ఆకుల పేస్ట్, టమాటా రసం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొటిమలపై పూసి.ఇరవై లేదా ముప్పై నిమిషాల పాటు డ్రై అవ్వనివ్వాలి.
ఆ తర్వాత చల్లటి నీటితో క్లీన్ చేసుకోవాలి.ఇలా ప్రతి రోజు చేస్తూ ఉంటే.
క్రమంగా మొటిమలు తగ్గు ముఖం పడతాయి.
జామా ఆకులను ఎండ బెట్టి పొడి చేసుకోవాలి.
ఆ పొడిలో కొద్దిగా తేనె మరియు పెరుగు వేసి బాగా కలుపు కోవాలి.ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని మొటిమలు ఉన్న చోట మాత్రమే కాకుండా ముఖం మొత్తానికి పూసుకోవాలి.
ఒక పావ గంట పాటు డ్రై అవ్వనిచ్చి.అప్పుడు కూల్ వాటర్‌తో వాష్ చేసుకోవాలి.
ఇలా ప్రతి రోజు చేయడం వల్ల మొటిమలు తగ్గడంతో పాటు ముఖం యవ్వనంగా మరియు కాంతివంతంగా మారుతుంది.ముడతలు కూడా పోతాయి.