ప్రస్తుతం రంజాన్ మాసం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.రంజాన్ అంటే మొదట గుర్తుకు వచ్చేది ఉపవాసాలే.
ఇస్లాం మతాన్ని ఆచరించే వారందరూ కామ, క్రోధ, అహంకార, అహింసా వంటి దుర్గుణాలను వదిలేసి ఈ రంజాన్ మాసంలో పరమ పవిత్రతంగా ఉపవాస దీక్షలు చేస్తూ.భగవంతుడి ప్రార్థనలతో గడుపుతారు.
రంజాన్ ఉపవాసాలు కఠినంగానే ఉంటాయి.అయినప్పటికీ ముస్లిం సోదరులు ఎంతో ఇష్టంగా చేస్తుంటారు.
అయితే ఇది రంజాన్ మసం మాత్రమే కాదు.వెసవి కాలం కూడా.అందుకే ఉపవాసాలు చేసే వారు ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.లేదంటే ప్రాణాలే రిస్క్‌లో పడతాయి.
మరి లేట్ చేయకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.సమ్మర్‌లో అధికంగా వేధించే సమస్యల్లో డీహైడ్రేషన్ ఒకటి.
శరీరంలో నీటి శాతం తగ్గినప్పుడు డీహైడ్రేషన్ ఏర్పడుతుంది.అయితే ఉపవాసాలు చేసే ముస్లిమ్‌లు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకూ ఆహారం తినరు.
కనీసం మంచి నీరు కూడా తాగరు.
అందుకే రోజుకు సరిపోయే నీటిని రాత్రి నుంచి తెల్లవారే లోపునే తాగాలి.శరీరంలో నీటి శాతాన్ని పెంచే పండ్లును తీసుకోవాలి.తద్వారా డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు.
అలాగే రంజాన్ ఉపవాసాలు చేసే వారిలో చాలా మంది.సూర్యోదయానికి ముందు తినడం మానేస్తుంటారు.
కానీ, ఇలా చేయడం చాలా తప్పు.సూర్యోదయానికి ముందు తప్పకుండా ఫైబర్, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉండే ఆహారం తీసుకోవాలి.
గోధుమలతో తయారు చేసే రొట్టెలు, ఆలుగడ్డలు, బ్రెడ్, రైస్ వంటి తీసుకుంటే.ఇవి మెల్లగా జీర్ణం అవుతాయి.దాంతో ఉపవాస సమయంలో నీరసం, అలసట రాకుండా ఉంటాయి.ఉపవాసం తర్వాత కార్బోహైడ్రేట్లు తక్కువగా, ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవాలి.
మరియు పండ్ల రసాలు, సూపులు తీసుకోవాలి.ఇక చాలా మంది ఉపవాసం తర్వాత కడుపు నిండా తినేసి పడుకుంటారు.
కానీ, తిన్న వెంటనే నిద్రించరాదు.కనీసం రెండు గంటల గ్యాప్ ఉండాలి.
ఇక మధుమేహం, రక్తపోటు, గుండె సంబంధిత జబ్బులు ఉన్న వారు ఉపవాసం చేసే ముందు తప్పకుండా వైద్యులను సంప్రదించాలి.