తెలంగాణలో నైట్ కర్ఫ్యూ పై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు.. !?

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రజలను తీవ్రంగా కుమ్ముకుంటున్న వేళ లేటుగా కళ్లు తెరచిన అధికారులు ఈరోజు నుండి నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు.ఈ క్రమంలో ఏ మేరకు కరోనా కంట్రోల్ అవుతుందో తెలియదు గానీ ఈ కర్ఫ్యూ విషయంలో మాత్రం ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ అసహనం వ్యక్తం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

 Mim Mp Asaduddin Comments On Night Curfew, Telangana, Mim Mp, Asaduddin, Sensati-TeluguStop.com

కర్ఫ్యూ సమయంలో మార్పు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని, లేదంటే ప్రభుత్వ నిర్ణయం పేదలపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయని ట్వీట్ చేశారు.ఇదిలా ఉండగా రాష్ట్ర అధికారాల మీద కేంద్రం కొత్త రకమైన ఆక్రమణలకు పాల్పడుతోందని, కోర్టులు విధాన పరమైన నిర్ణయాల్లో జోక్యం చేసుకోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలపై ఇది ప్రభావం చూపుతోందంటూ ట్వీట్ చేశారు.

కాగా ఈ నేపథ్యంలో లాక్‌డౌన్ సమయాన్ని రాత్రి 10 గంటల నుంచి ప్రారంభించాలని, పాలు, ఇతర అవసరమైన ఆహార పదార్థాలను కూడా మినహాయింపునిచ్చే సర్వీసుల్లో చేర్చాలని కోరారు అసదుద్దీన్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube