విపక్ష పార్టీలకు అజెండానే లేదు..!

ఖమ్మం కార్పొరేషన్ ఎలక్షన్స్ లో రాజకీయ వేడి పెరిగింది.అధికార పార్టీ మీద ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నారు.

 Minister Ajay Kumar About Khammam Elections, Minister Ajay Kumar,khammam Electio-TeluguStop.com

అయితే వాటికి కౌంటర్ ఇవ్వడంలో ఏమాత్రం తగ్గట్లేదు అధికార పార్టీ నేతలు.కార్పొరేషన్ ఎలక్షన్స్ లో పోటీ చేస్తున్న విపక్షాలకు ఎలాంటి అభివృద్ధి అజెండా లేదని.

తాము చేస్తున్న అభివృద్ధిని వ్యతిరేకిస్తూ రాజకీయ దుర్భుద్దితో విష ప్రచారం చేస్తున్నారని అన్నారు రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.టీ.ఆర్.ఎస్ హయాంలో ఖమ్మం కార్పొరేషన్ లో జరిగిన అభివృద్ధికి సంబంధించిన కరపత్రాలను ఆయన విడుదల చేశారు.

సద్విమర్శ చేస్తే ప్రతి పక్షాల విలువ ఉంటుందని.తాము చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక దుష్ప్రచారం చేస్తే గుణపాఠం తప్పదని అన్నారు.ఆ పార్టీ నాయకులు గతంలో పరిపాలించిన మున్సిపాలిటీల్లో జరిగిన అభివృద్ధిని బేరీజు వేసుకోవాలని అజయ్ అన్నారు.కాంగ్రెస్ ఆత్మ విమర్శ చేసుకోవాలని.

బీజేపీకి ఇక్కడ ఉనికి లేదని.భవిష్యత్ లోనూ రాదని మత విధ్వేషాలు రెచ్చగొట్టి ప్రజలను విభజించాలన్న ఆలోచనకు ఇంకా అంకురార్పణ జరగలేదని అన్నారు.

ఎన్నికల టైంలో మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు కాని తాము చేసిన అభివృద్ధి కర పత్రాలను విడుదల చేశామని.వాటితోనే ప్రజలని ఓట్లను అడుగుతామని అన్నారు అజయ్.

పాలిచ్చే ఆవుకు గడ్డి వేయాలా.? గాడిదకు గడ్డి వేయాలా అని కె.సి.ఆర్ చెపినట్టుగా ప్రజలే అది నిర్ణయించుకోవాలని అన్నారు అజయ్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube