తెలంగాణలో త్వరలో మరో ఎన్నికల సమరం మొదలు కానుంది.ఉప ఎన్నికల సమరం ఇటీవల ముగిసిన సంగతి తెలిసిందే.
అయితే త్వరలో వరంగల్, ఖమ్మం, సిద్దిపేట, జడ్చర్ల, అచ్చంపేట పురపాలికలకు ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే.ఇంకా కార్పొరేషన్ ఎన్నికల సమరం మొదలు కాక ముందే ఇప్పుడే టీఆర్ఎస్ లో మేయర్ సీట్లపై కొట్లాట మొదలైందని చెప్పవచ్చు.
అయితే టీఆర్ఎస్ లో పాత వారి, కొత్త వారి చేరికతో ఆశావాహులు ఎక్కువైన పరిస్థితి ఉంది.అయితే టీడీపీ టీంకు మేయర్ సీటు కేటాయిస్తున్నారనే విషయం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీస్తోంది.
టీఆర్ఎస్ ను ఎప్పటి నుండో అంటిపెట్టుకున్న వారిని పట్టించుకోకుండా మధ్యలో వచ్చిన టీడీపీ నేతలకు ప్రాధాన్యత ఇవ్వడం పట్ల మండి పడుతున్నారు.అయితే ఈ పరిణామాల పట్ల రాజకీయ వర్గాలలో ఆసక్తి కర చర్చ జరుగుతోంది.
కేసీఆర్ అప్పట్లో ఇబ్బడి ముబ్బడిగా టీఆర్ఎస్ లోకి ఇతర పార్టీల నేతలను ఆహ్వానించిన కేసీఆర్ ఇప్పుడు దానికి తగు ఫలితం చూస్తాడని పలువురు చర్చించుకుంటున్నారు.మరి ఈ మేయర్ ఎన్నిక రచ్చ ఎంతటి వివాడానికి దారి తీస్తుందనేది చూడాల్సి ఉంది.
ఈ విషయంపై టీఆర్ఎస్ నేతలు బహిరంగంగా వ్యాఖ్యానించకున్నా రెబల్స్ రూపంలో నిరసన తెలిపే అవకాశమున్నట్లు తెలుస్తోంది.