మాటల మాంత్రికుడు త్రినివాస్ శ్రీనివాస్ ఒకే హీరోయిన్ ని కనీసం రెండు, మూడు సినిమాలలో కొనసాగిస్తూ ఉంటాడు.మొదటి నుంచి అతను ఇదే పద్ధతిని ఫాలో అవుతున్నాడు.
సమంతని మూడు సినిమాలలో హీరోయిన్ గా తీసుకున్నాడు.ఆ తర్వాత త్రివిక్రమ్ తో వరుసగా సినిమాలు చేసే అవకాశం పూజా హెగ్డేకి వచ్చిందని చెప్పాలి.
అరవింద సమేత సినిమా కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ తారక్ కి జోడీగా పూజా హెగ్డేని తీసుకున్నాడు.అలాగే అందులో ఆమె పాత్ర చుట్టూనే కథ మొత్తం తిరుగుతుంది.
తరువాత అల వైకుంఠపురంలో సినిమాలో కూడా పూజానే మెయిన్ హీరోయిన్ గా తీసుకున్నాడు.ఈ సినిమాలో కూడా ఆమె పాత్రకి చాలా ప్రాధాన్యత ఉంటుంది.
ఈ రెండు సినిమాల తర్వాత త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో సినిమా అనుకున్నాడు.ఆ సినిమా కోసం పూజానే తీసుకోవాలని అనుకున్న ఏవో కారణాల వలన ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యింది.
ఇంతలో త్రివిక్రమ్ శ్రీనివాస్ సూపర్ స్టార్ మహేష్ బాబుకి కథ చెప్పి ఒకే చేసుకున్నారు.సర్కారు వారి పాట ముగియగానే ఈ సినిమా మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమాని స్టార్ట్ చేస్తారు.
త్రివిక్రమ్, మహేష్ కలయికలో అతడు, ఖలేజా సినిమాలు వచ్చాయి.ఇప్పుడు హ్యాట్రిక్ మూవీ చేయబోతున్నారు.హారికాహాసినీ క్రియేషన్స్ వారే ఈ సినిమాని నిర్మిస్తున్నారు.ఇదిలా ఉంటే మహేష్ సినిమాకి సంబంధించి ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా జరిగిపోతుందని తెలుస్తుంది.
అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డేని ఖరారు చేసినట్లు టాక్ వినిపిస్తుంది.ఇక ఈ సినిమా కోసం పూజా హెగ్డేకి మూడు కోట్లకి పైగా రెమ్యునరేషన్ ఇవ్వడానికి త్రివిక్రమ్ రెడీ అయినట్లు తెలుస్తుంది.
ఇక మహేష్ బాబుతో, అలాగే పూజా హెగ్డేతో త్రివిక్రమ్ చేస్తున్న మూడో సినిమా ఇది కావడం విశేషం.త్వరలో ఈ సినిమాకి సంబంధించి అఫీషియల్ ఎనౌన్స్ వచ్చే అవకాశం ఉందని టాక్.