ఓ పక్క దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేస్తున్నా సరే మరోపక్క కరోనా తన ఉగ్రరూపం చూపిస్తుంది.సినీ, రాజకీయ సెలబ్రిటీస్ కు కరోనా ఎఫెక్ట్ బాగా చూపిస్తుంది.
ఈమధ్యనే కరోనా వచ్చినట్టుగా వెల్లడించి అందరికి షాక్ ఇచ్చారు మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్.అయితే వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల కరోనా వచ్చినా దాని తీవ్రత తక్కువగా ఉందని చెప్పారు అల్లు అరవింద్.
అంతేకాదు కరోనా వ్యాక్సిన్ తీసుకోకపోవడం వల్ల తన స్నేహితుడు కరోనా వల్ల హాస్పిటల్ లో ఇబ్బందులు పడుతున్నాడని చెప్పారు.
ఇక ఇదిలాఉంటే లేటెస్ట్ గా ప్రముఖ నటి, కాంగ్రెస్ నేత నగ్మాకి కరోనా పాజిట్ వచ్చినట్టు తెలుస్తుంది.
లేటెస్ట్ గా కోవిడ్ టెస్ట్ చేయించుకున్న నగ్మాకి పాజిటివ్ అని తేలిందట.ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఏప్రిల్ 2న నగ్మా కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారట.
అయినా సరే తనకు పాజిటివ్ వచ్చిందని నంగా ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.నగ్మాకు కరోనా అనగానే ఆమె ఫ్యాన్స్ ఆమె ఫాలోవర్స్ అంతా ఆమెకు వెంటనే క్యూర్ అవ్వాలని త్వరగా కోలుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు.
ప్రస్తుతం నగ్మా హోం ఐసోలేషన్ లోనే ఉన్నట్టు తెలుస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా పై మళ్లీ ఏరియాల వారీగా తీవ్రతని బట్టి ఆంక్షలు విధించాలని చూస్తున్నారు.