తప్పు చేసిన వారికి జరిమాన విధించడం కామనే.కానీ వ్యాపార రంగాన్ని శాసిస్తున్న అంబానీ ఫ్యామిలీకి విధించిన జరిమాన ఎంతో చూస్తే కళ్లు తిరగడం ఖాయం.
అదీ కూడా సుమారుగా 20 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనలో.
ఓ టేకోవర్ లో నిబంధనల ఉల్లంఘన జరిగిందని తేల్చిన సెబీ, 2000 సంవత్సరంలో జరిగిన డీల్ లో 5 శాతం వాటా చేతులు మారగా, దీనికి సంబంధించి సంస్థ ప్రమోటర్లు వివరాలు అందించడంలో విఫలమయ్యారని పేర్కొంటూ అంబానీ సోదరులు, వారి భార్యలు నీతా అంబానీ, టీనా అంబానీలతో పాటు మరికొన్ని కంపెనీలపైనా జరిమానా విధిస్తున్నట్టు వెల్లడించింది.
ఇంతకు ఈ జరిమాన విలువ ఎంతనుకుంటున్నారు.పదో పరకో కాదు.ఏకంగా రూ.25 కోట్లట.అంబానీ ఫ్యామిలీ అంటే అ మాత్రం భరించవలసిందే కదా.ఇకపోతే 2000 సంవత్సరంలో 6.83 శాతం ఈక్విటీకి సమానమైన షేర్లను ఆర్ఐఎల్ ప్రమోటర్లు, పీఏసీ వారంట్లతో కూడిన రిడీమబుల్ డిబెంచర్ల ద్వారా సొంతం చేసుకున్న ఈ సంస్ద ఈ వాటాల బదిలీ వివరాలను అదే సంవత్సరం జనవరి 7న ప్రకటించాల్సి ఉండగా ఎలాంటి ప్రకటనా విడుదల చేయలేదట.అందుకే ఈ పెద్ద మొత్తంలో ఫైన్ విధించినట్లు సెబీ పేర్కొంది.