సోషల్ మీడియాలేని కాలంలో వంటకాలు అంటే మన ఇండ్లలో పెద్ద వాళ్ళకు తెలిసినవి పండగల సందర్భంలో మనం చేసుకోవడం జరుగుతుంది.ఎందుకంటే కొత్త వంటకాలు అంటే కొత్తగా ప్రయత్నిస్తే తప్ప తెలిసే అవకాశం లేదు.
కాని ప్రస్తుతం ఇప్పుడు పరిస్థితి అలా లేదు.కొత్త వంటకాలు రోజుకు కొన్ని పుట్టుకొస్తున్నాయి.
ఇక పండగల సందర్భాలలో కొత్త వెరైటీలతో హోటల్స్ దర్శనమిస్తాయి.ఎందుకంటే ఆయా హోటల్స్ కు వచ్చే రెగ్యులర్ కష్టమర్లకు కొట్ట రకం రుచులను అందించడానికి చాలా రకాలుగా ప్రయత్నిస్తారు.
కస్టమర్స్ కూడా అవే ఆశిస్తారు.అంతేకాక ఇప్పుడు కొత్త వంటకాల ట్రెండ్ వదిలి ఇప్పడు వంటకాలతో రికార్డులు బద్దలు కొడుతున్న పరిస్థితి ఉంది.
మామూలుగా కాటీ రోల్ అంటే మనం ఎప్పుడో ఒకప్పుడు తిని ఉంటాం.అయితే కాటీ రోల్ కు బదులుగా ఎగ్, చికెన్ తో కలిపి చికెన్ రోల్ అని వంటకం చాలా ఫేమస్.
అయితే ఇది కొద్ది పాటి పరిమాణంలో మాత్రమే ఉంటుంది.అయితే ఇప్పుడు ఇదే చికెన్ ఎగ్ రోల్ ను ప్రపంచంలో కెల్లా అతిపెద్ద ఎగ్ రోల్ ని తయారు చేశారు.
అయితే ఈ చికెన్ ఎగ్ రోల్ ధర ఎంతో తెలిస్తే ఆశ్చర్య పోతారు.ఈ చికెన్ ఎగ్ రోల్ ధర కేవలం 349 రూపాయలు పన్నీర్ టికా, గుడ్డు తురుము,జున్ను ఇలా రకరకాల పదార్థాలతో ఎంతో స్పెషల్ గా దీన్ని తయారు చేశారు.
ఈ వీడియో ఇప్పడు నెట్టింట్లో వైరల్ గా మారింది.ఈ వీడియోను చూస్తున్న నెటిజన్లు ఇంత పెద్ద చికెన్ ఎగ్ రోల్ ను చూసి ఆశ్చర్యపోతున్నారు.
మీకూ ఈ వీడియో చూడాలని ఉందా.ఇంకెందుకు ఆలస్యం చూసేయండి మరి.