హాన్సికా ఇంట పెళ్లి సందడి... మరి ఈమె ఎప్పుడో

బాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ ప్రారంభించి తరువాత 15 ఏళ్లకే దేశ ముదురు సినిమాతో హీరోయిన్ అయిపోయిన అందాల భామ హాన్సికా మొత్వానీ.మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని తరువాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా టాలీవుడ్ లో వరుస అవకాశాలు సొంతం చేసుకుంది.ఒకానొక దశలో స్టార్ హీరోయిన్ ఇమేజ్ ని అందుకుంది.తరువాత తెలుగులో అవకాశాలు తగ్గిపోవడంతో కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా తన హవా కొనసాగించింది.

 Hansika Motwani Poses With Family At Brother's Wedding, Tollywood, Kollywood, So-TeluguStop.com

అక్కడ స్టార్ హీరోయిన్ ఇమేజ్ అందుకోవడంతో పాటు ఖుష్బూ తర్వాత తమిళనాడులో ప్రేక్షకులు గుడి కట్టిన హీరోయిన్ గా హాన్సికా అరుదైన గౌరవం దక్కించుకుంది.తరువాత కోలీవుడ్ హీరో శింబుతో కొంతకాలం ప్రేమాయణం సాగించింది.

ఇద్దరూ పెళ్లి చేసుకుంటారని టాక్ వచ్చింది.వాళ్ళు కూడా బహిరంగంగానే తమ ప్రేమ విషయాన్ని చెప్పుకున్నారు.

అయితే తరువాత ఏమైందో కాని ఇద్దరు బ్రేక్ అప్ చెప్పుకున్నారు.తరువాత హాన్సికా సినిమాల పీద ఫోకస్ పెట్టింది.

అయితే తరువాత ఈ అమ్మడికి అడపాదడపా అవకాశాలు వస్తున్న సక్సెస్ మాత్రం పెద్దగా లేవనే చెప్పాలి.హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి 15 ఏళ్ల కెరియర్ ని పూర్తి చేసుకోవడంతో పాటు హీరోయిన్స్ కి అరుదుగా లభించి 50 సినిమాల రికార్డ్ ని కూడా ఈ భామ సొంతం చేసుకుంటుంది.

ప్రస్తుతం ఈ భామ మహా అనే సినిమాలో నటిస్తుంది.ఇది ఆమె 50వ సినిమా కావడం విశేషం.కాగా.కొన్ని రోజులుగా హాన్సికా తన ఫ్యామిలీతో పెళ్లి సంబరాల్లో మునిగితేలుతోంది.

తన సోదరుడు ప్రశాంత్ మోత్వానీ, టీవీ నటి ముస్కాన్ నాన్సీ మార్చి 22న ఒక్కటయ్యారు.జైపూర్ లో జరిగిన ఈ వివాహ వేడుకలో హన్సిక ఫుల్లుగా ఎంజాయ్ చేసింది.

ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అవి వైరల్ అవుతున్నాయి.అయితే సోదరుడు పెళ్లి సరే మరి నువ్వు పెళ్లి ఎప్పుడు చెసుకుంటావ్ అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube