తిరుపతి ఉప ఎన్నిక కోసం అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ.. !

ఏపీలోని తిరుపతి పార్లమెంటు స్థానం ఉప ఎన్నిక కోసం ఇప్పటికే టీడీపీ, వైసీపీ తమ అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే.కానీ బీజేపీ మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.

 Bjp Announces Tirupathi By Elections Candidate, Tirupati, By Polls, Bjp, Candid-TeluguStop.com

అయితే తాజగా మాజీ ఐఏఎస్ అధికారిణి రత్నప్రభ పేరును ఖరారు చేశారనే సమాచారం మాత్రం బయటకు వచ్చింది.కానీ బీజేపీ నుంచి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.

ఇదిలా ఉండగా తిరుపతి ఉప ఎన్నిక బరిలో బీజేపీ అభ్యర్థి ఎవరన్న ఉత్కంఠకు ఈ సమాచరంతో తెరపడినట్టయింది.ఇకపోతే ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాకు చెందిన రత్నప్రభ 1981 క్యాడర్ కర్ణాటక ఐఏఎస్ అధికారి.

కాగా రిటైరయ్యే నాటికి రత్నప్రభ కర్ణాటక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సేవలు అందించారు.డిప్యుటేషన్ పై ఏపీలోనూ ఉన్నతస్థాయిలో విధులు కూడా నిర్వర్తించారు.

అయితే పదవీ విరమణ తర్వాత బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.ఇక ఏప్రిల్ 17న తిరుపతి ఉప ఎన్నిక జరుపుతుండగా మే 2న ఓట్ల లెక్కింపు చేపడతారని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube