టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియా హీరోగా గుర్తింపును సంపాదించుకున్న తొలి హీరో ప్రభాస్ అయినప్పటికీ ప్రభాస్ మాత్రం ఎంత ఎదిగినా అదేస్థాయిలో ఒదిగి ఉంటారు.ఇతరులను గౌరవించడంలో ప్రభాస్ కు సాటి వచ్చే మరో హీరో లేరనే చెప్పాలి.
ప్రభాస్ గత కొన్నేళ్ల నుంచి రెండు, మూడు సంవత్సరాలకు ఒక సినిమా చొప్పున నటిస్తున్నారు.అయితే ఫ్యాన్స్ ప్రభాస్ వేగంగా సినిమాలు చేయాలని కోరడంతో ప్రభాస్ ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నారు.
ఒకవైపు సలార్ సినిమాలో మరోవైపు ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ నటిస్తున్నారు.ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ రాముని పాత్రలో నటిస్తుండగా కృతిసనన్ సీత పాత్రలో నటిస్తున్నారు.
అయితే తాజాగా కృతిసనన్ ప్రభాస్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.అయితే కృతిసనన్ మాత్రం ప్రభాస్ తరపున ఆదిపురుష్ చిత్రయూనిట్ కు భోజనాలు అందుతున్నాయని.
ఆ వంటకాల రుచి అద్భుతంగా ఉందని చెబుతున్నారు.
ప్రభాస్ తొలుత మాట్లాడటానికి కొంచెం సిగ్గు పడేవారని ఇప్పుడు మాత్రం నాన్ స్టాప్ గా మాట్లాడుతున్నారని ఆమె తెలిపారు.
ఒక ఇంటర్వ్యూలో కృతిసనన్ మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు.ఎన్నో వెరైటీలను చేయించి షూటింగ్ లో పాల్గొనే వారికి తిండి విషయంలో ప్రభాస్ ఎలాంటి ఇబ్బంది రాకుండా వ్యవహరిస్తారని కృతిసనన్ అన్నారు.
ప్రభాస్ కు జోడీగా నటించే ఛాన్స్ రావడంతో ఎంతో లక్కీ అని ఆమె తెలిపారు.
మరోవైపు ప్రభాస్ ఈ సినిమాలతో పాటు నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ఒక సైన్స్ ఫిక్షన్ సినిమాలో నటిస్తున్నారు.
ఈ సైన్స్ ఫిక్షన్ పై భారీగా అంచనాలు నెలకొన్నాయి.వచ్చే రెండేళ్లలో ఈ మూడు విడుదల కానున్నాయి.
ఈ ఏడాది ప్రభాస్ నటిస్తున్న రాధేశ్యామ్ సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే.