పోలీసులుల్లో కక్కూర్తి పోలీసులు ఉంటారని నిరూపించిన ఘటన ఇప్పుడు మనం చదవబోయేది.ఉత్తరప్రదేశ్ ఈటా జిల్లాలో ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి నడుపుతున్న ధాబాకు ఫిబ్రవరి 4న మధ్యాహ్నం ఓ ఎస్సై, ఇద్దరు కానిస్టేబుల్స్ వచ్చి భోజనం చేశారు.కాగా 400 రూపాయల బిల్లు అవ్వగా కేవలం 80 రూపాయలు మాత్రమే ఇస్తామని అనడంతో ఆ దాభా ఓనర్ కనీసం రూ.200 అయినా చెల్లించాలని కోరాడు.
అప్పటికే పీకలదాకా మద్యం సేవించి ఉన్న పోలీసులు ఆ దాభా ఓనర్‌తో గొడవకు దిగారట.ఈ క్రమంలో అడ్డుకున్న ధాభాలోని 9మంది కస్టమర్లను కూడా మీ అంతు చూస్తాం అని పోలీసులు బెదిరిస్తూ, బిల్లు కట్టకుండానే వెళ్లిపోయారట.
ఆ కాసేపటికే 15 మంది పోలీసులు ధాబాకి చేరుకొని ప్రవీణ కుమార్ దివ్యాంగుడనే కారణంతో అతడిని వదిలేసి అతడి తమ్ముడు,మరియు ధాబా ఓనర్ కి మద్దుతుగా నిలిచిన 9మంది కస్టమర్లను అరెస్ట్ చేసి కొత్వాలి దేహాట్ పోలీస్ స్టేషన్ లో అడ్దమైన కేసులను వారిపై వేసి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.ఇక ఈ వివాదం కాస్త ముదరడంతో జిల్లా ఉన్నతాధికారులు రంగంలోకి దిగి, ఘటనకు బాధ్యులైన ఎస్సై, ఇద్దరు కానిస్టేబుల్స్‌ని సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించారట.