విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఖచ్చితంగా ఏపీ స్పెషల్ స్టేటస్ ద్వారా మాత్రమే న్యాయం జరుగుతుందని అందరూ భావించారు.విభజన జరిగిన తర్వాత ముఖ్యమంత్రిగా వ్యవహరించిన చంద్రబాబు స్పెషల్ స్టేటస్ వల్ల ఉపయోగం ఏమీ ఉండదని స్పెషల్ ప్యాకేజ్ కి జై కొట్టారు.
దీంతో అప్పటి నుండి కేంద్రం ఏపీకి స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చేసాము స్పెషల్ స్టేటస్ ఇచ్చేది లేదు అంటూ తేల్చి చెప్పటం జరిగింది.ఆ టైములో ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ ప్రతిపక్షంగా ఉన్న ఈ సమయంలో వైసీపీ ని గెలిపిస్తే స్పెషల్ స్టేటస్ తీసుకొస్తా మంటూ ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది.
దీంతో ఏపీ ప్రజలు వైసీపీకి దాదాపు 22 ఎంపీ పదవులను కట్టబెట్టిన గానీ ఇప్పటివరకు ఏపీ స్పెషల్ స్టేటస్ విషయంలో జగన్ ప్రభుత్వం కూడా కేంద్రాన్ని ఒప్పించలేకపోయింది.పరిస్థితి ఇలా ఉండగా మరోసారి కేంద్రం ఏపీ స్పెషల్ స్టేటస్ విషయంలో పార్లమెంటు సాక్షిగా కీలక కామెంట్ చేసింది.తాజాగా పార్లమెంటు లో టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఏపీ స్పెషల్ స్టేటస్ గురించి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ సూటిగా సమాధానం చెప్పారు.14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని స్పష్టం చేశారు.ఏపికి ప్రత్యేక ప్యాకేజీతో పాటు అనేక మినహాయింపులు ఇచ్చామని మంత్రి తెలిపారు.ఏదిఏమైనా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని కేంద్రం మరోసారి స్పష్టం చేయటంతో ఈ వార్త ఏపీ రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది.