జడ్పిటిసి, ఎంపిటిసి ఎలక్షన్ విషయంలో హైకోర్టు కీలక కామెంట్లు..!!

దేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మొన్న ప్రధాని మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో రాష్ట్రాల్లో కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ప్రధాని తెలిపారు.

 High Court Key Comments On Zptc And Mptc Elections Corona Virus,zptc, Mptc, High-TeluguStop.com

అంత మాత్రమే కాక వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమం వేగవంతం చేయాలని సూచించారు.దీంతో ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మిగిలి ఉన్న పరిషత్ ఎన్నికల నిర్వహణ త్వరగా ముగించేసి వెంటనే అధికారులను కరోనా వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమంలో విధులు నిర్వహించేలా ఆలోచనలు చేసే రీతిలో అధికారులతో సమావేశమయ్యారు.

ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మిగిలిపోయిన జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించి గవర్నర్, హైకోర్ట్ కి తెలపాలని పేర్కొన్నారు.దీంతో అధికారులు హైకోర్టులో పరిషత్ ఎన్నికలకు సంబంధించి వెంటనే నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని పిటిషన్ దాఖలు చేయడం అందరికీ తెలిసిందే.

ఈ పిటిషన్ ఇటీవల విచారణకు రాగా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.ఎట్టి పరిస్థితుల్లో జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికల విషయంలో వెంటనే ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు ఇవ్వలేను అని స్పష్టం చేసింది.

దీంతో ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని దాఖలైన అనుబంధ పిటిషన్ లన్నిటిని డిస్మిస్ చేసింది.ఇదే తరుణంలో ప్రధాన పిటిషన్లపై కౌంటర్ దాఖలు చేయాలని ఎన్నికల కమిషనర్ కి ఆదేశాలు జారీ చేస్తూ తదుపరి విచారణ ఈనెల 30 కి వాయిదా వేసింది హైకోర్టు. 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube