హిందూపురం నియోజక వర్గానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ నియోజకవర్గంలో పర్యటన చేస్తున్నారు.బాలయ్య రాకతో నియోజకవర్గంలో టీడీపీ కేడర్లో ఉత్సాహం నెలకొంది.
ఈ సందర్భంగా కేడర్ ని ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని ప్రభుత్వం పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని విమర్శల వర్షం కురిపించారు.
ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికలలో ఏ విధంగా అధికార పార్టీ బెదిరింపులకు పాల్పడుతుందో ప్రజలంతా గమనిస్తున్నారని పేర్కొన్నారు.
ప్రశాంతంగా జరగాల్సిన ఎన్నికలు అలజడి రేపుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ మరికొన్ని కుటుంబాలను మానసిక క్షోభకు గురిచేస్తున్నారు అంటూ బాలయ్య బాబు విరుచుకుపడ్డారు.
అడిగే వారు లేరనే అధికార పార్టీ వారు బరితెగింపు లకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.అభివృద్ధి వైపు ప్రజల ఓటు వుంటుందని ఈ క్రమంలో పేర్కొన్నారు.ఇలా ఉంటే నియోజకవర్గంలో ఎవరినైనా టిడిపి పార్టీకి చెందిన క్యాడర్ ని బెదిరింపులకు గురి చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటుందని అవసరమైతే ప్రాణాలు అడ్డుపెట్టి అయినా కార్యకర్తలను రక్షించుకుంటానని, వైసీపీ బెదిరింపులకు తలొగ్గద్దని.విద్యార్థులకు వార్నింగ్ ఇస్తూ ఎమ్మెల్యే బాలయ్య ఎమోషనల్ డైలాగులు వేశారు.