మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి హీరోహీరోయిన్లుగా బుచ్చిబాబు సనా డైరెక్షన్ లో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఉప్పెన ఫిబ్రవరి 12వ తేదీన విడుదలై పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.సంక్రాంతి సినిమాల సందడి తగ్గిపోవడం, బాక్సాఫీస్ దగ్గర పోటీనిచ్చే సినిమాలు లేకపోవడంతో బాక్సాఫీస్ దగ్గర ఉప్పెన కలెక్షన్లపరంగా కొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది.
ఉప్పెన వైష్ణవ్ తేజ్ తొలి సినిమానే అయినప్పటికీ టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలకు సమానంగా కలెక్షన్లను రాబడుతోంది.22 కోట్ల టార్గెట్ తో విడుదలైన ఉప్పెన మూడు రోజుల్లోనే టార్గెట్ ను రీచ్ కావడంతో పాటు 50 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధించింది.వీక్ డేస్ కావడంతో నేటి నుంచి కలెక్షన్లు తగ్గే అవకాశం ఉన్నా లాక్ డౌన్ తర్వాత ఫ్యామిలీలను థియేటర్లకు రప్పించిన సినిమాగా ఉప్పెన అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా షేర్ కలెక్షన్లు 25 కోట్ల రూపాయలుగా ఉన్నాయి.ఏరియాల వారీగా పరిశీలిస్తే నైజాంలో రూ.8.53 కోట్లు, సీడెడ్ లో రూ.3.70 కోట్లు, వైజాగ్ లో రూ.4.15 కోట్లు, ఉభయ గోదావరి జిల్లాల్లో రూ.3.89 కోట్లు, కృష్ణా, గుంటూరు జిల్లాలలో రూ.3.83 కోట్లు, నెల్లూరు జిల్లాలో 86 లక్షల కలెక్షన్లు వచ్చాయి.వీకెండ్ కలెక్షన్లలో ఉప్పెన చిరంజీవి ఖైదీ నంబర్ 150, మహేష్ సరిలేరు నీకెవ్వరు, ఎన్టీఆర్ అరవింద సమేత సినిమాలను కూడా క్రాస్ చేసిందని తెలుస్తోంది.
వైష్ణవ్ తేజ్ తొలి సినిమాతోనే స్టార్ హీరోల జాబితాలోకి చేరిపోయాడని చెప్పాలి.కళ్లు చెదిరే రీతిలో ఈ సినిమా కలెక్షన్లను సాధిస్తుండగా ఈరోజు దర్శకుడు బుచ్చిబాబు బర్త్ డే కావడంతో బుచ్చిబాబు ఫోటోతో కలెక్షన్లకు సంబంధించిన పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.