అగ్ర రాజ్యం అమెరికాలో తప్పు చేస్తే ఖటినమైన శిక్షలు విధిస్తారు.ఏళ్ళ తరబడి కేసులు సాగదీయ కుండా కేసుల పై శిక్షలకు త్వరితగతిన పూర్తి చేసిన దోషులకు శిక్షలు పడేలా చేస్తారు.
అక్కడి నియామాలు ఎంతో కటినంగా ఉంటాయి కూడా.తప్పు చేసిన వాళ్ళు ఎంతటి వాళ్ళయినా తప్పించుకోవడం అసంభవమే.
జైలుకు వెళ్లి రావడం అంటేనే వణికిపోతారు కేటుగాళ్ళు.అలాంటిది ఒక్క సారిగా జైళ్లలో ఉండే ఖైదీలు రెచ్చిపోయారు.
జైలా తొక్కా అనుకున్నారో ఏమో కానీ జైల్లో రచ్చ రచ్చ చేస్తూ సిబ్బందికి చుక్కలు చూపించారు.వివరాలోకి వెళ్తే.
అమెరికాలోని సెయింట్ లూయిస్ జైలు అంటే అత్యంత పటిష్టమైన భద్రత కలిగిన జైలు అక్కడి రూల్స్ అన్నీ చాలా స్ట్రిక్ట్ గానే ఉంటాయి.అయితే ఈ జైలులోని ఖైదీలు అందరూ ఒక్క సారిగా రెచ్చి పోయారు.
జైలులో భయానక వాతావరణం సృష్టించారు.కారణం ఏంటంటే కరోనా.
కరోనా అమెర్కాలో రికార్డ్ స్థాయికి చేరుకోవడంతో జైలులో నిభందనలు మరింత కటినం చేశారు.ఖైదీలను పలకరించడానికి వచ్చే భంధువులు, స్నేహితుల పరిమితిని తగ్గించారు.
దాంతో ఖైదీలు ఎంతో మానసిక వేదనకు లోనయ్యారు, దానికి తగ్గట్టుగా ఖైదీల కోర్టు విచారణలు కూడా నిలిపివేశారు దాంతో మరింత ఆందోళన చెందిన ఖైదీలు సహనం కోల్పోయారు.
దాంతో జైలు నాలుగో అంతస్తు ఎక్కి అక్కడి బల్లలు కుర్చీలు ధ్వసం చేశారు.అంతేకాదు మంచాలు, పరుపులకు నిప్పు పెట్టి అధికారులతో గొడవలకు దిగారు.దాంతో పరిస్థితి అదుపు తప్పింది.విచక్షణ కోల్పోయిన ఖైదీలు తమ నిరసనను తెలుపుతూనే ఉన్నారు.ఉన్నత అధికారులు వచ్చి వారిని శాంతింప చేసేవరకూ కూడా పరిస్థితి అదుపులోకి రాలేదు.ఈ ఘర్షణలో ఓ అధికారి గాయాల పాలవ్వగా చికిత్స పొందుతున్నారు.
ఈ పరిస్థితికి కారకులను గుర్తించిన అధికారులు 65 మందిని అదుపులోకి తీసుకుని వేరే జైలుకు తరలించారు.గొడవలకు కారణం అయిన వారిపై అదనపు చర్యలు ఉంటాయని జైలు అధికారులు మీడియాకు తెలిపారు.