నాగార్జున సాగర్‌లో టీఆర్ఎస్‌కు ఆ నేత షాక్ ఇవ్వనున్నాడా.. ??

నాగార్జునసాగర్ లో గత కొద్ది నెలల క్రితం టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతి చెందటంతో ఇక్కడ త్వరలో ఉప ఎన్నికలు జరగబోతున్నాయన్న విషయం తెలిసిందే.అయితే ఇప్పటికే దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయాలను సొంతం చేసుకున్న బీజేపీ ఇక్కడ కూడా పాగా వేయాలని పట్టుదలగా ఉంది.

 Trs Mlc To Join Bjp, Nagarjuna Sagar By Elections, Trs Vs Bjp,nagarjuna Sagar, C-TeluguStop.com

కాగా తమ సిట్టింగ్ స్థానమైన నాగార్జునసాగర్‌ను తిరిగి సొంతం చేసుకోవాలని టీఆర్ఎస్ కూడా అంతకంటే ఎక్కువ పట్టుదలగా ఉంది.ఇక కాంగ్రెస్ కూడా అదే తీరులో ఉంది.

అయితే ఇప్పటికే సాగర్ నుండి కాంగ్రెస్ తరపున ఆ పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి జానారెడ్డి బరిలోకి దిగడం ఖాయమవగా, టీఆర్ఎస్ తరపున నోముల నర్సింహయ్య కుటుంబ సభ్యులకు అవకాశం ఇస్తారా లేదా అనేది ఇంకా తేలలేదు.

ఇకపోతే నాగార్జునసాగర్‌లో కాంగ్రెస్, టీఆర్ఎస్‌తో పోలిస్తే బీజేపీకి పెద్దగా బలం లేదు.

అందుకే ఇక్కడ బలం పెంచుకోవడానికి గతంలో జానారెడ్డిపై పోటీ చేసి ఓడిపోయిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ చిన్నపరెడ్డి వైపు బీజేపీ నేతల గాలి మళ్లిందట.ఈ నేపధ్యంలో ఎమ్మెల్సీ చిన్నపరెడ్డి బీజేపీ ముఖ్యనేతలను హైదరాబాద్‌లోని ఓ రహస్య ప్రదేశంలో కలిశారని ప్రచారం సాగుతుంది.

ఇక నాగార్జునసాగర్ టికెట్ తనకు ఇస్తానని హామీ ఇస్తే తానూ బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు చిన్నపరెడ్డి చెప్పాడని వార్తలు వస్తున్నాయి.

అయితే దీనిపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని బీజేపీ ముఖ్య నేతలు చెప్పినట్లు సమాచారం.

మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో ఇంకా తెలియలేదు గానీ ఒకవేళ చిన్నపరెడ్డి, బీజేపీతో చేతులు కలిపి, పోటీ చేస్తే నాగార్జునసాగర్ ఉప ఎన్నిక మరింత రసవత్తరంగా మారే అవకాశం ఉందనే ఊహాగానాలు ఇప్పుడే మొదలైయ్యాయట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube