టాలీవుడ్ లో ప్రస్తుతం లెజెండరీ హీరో అంటే వెంటనే అందరూ మెగాస్టార్ చిరంజీవి పేరు చెబుతారు.1978లోసినిమా కెరియర్ స్టార్ట్ చేసి మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా ఏకంగా 151 సినిమాలని తన ఫిలిం జర్నీలో పూర్తి చేశారు.కమర్షియల్ సినిమాలకి కేరాఫ్ అడ్రెస్ గా మెగాస్టార్ మారిపోయారు.ఒక మూసలో వెళ్లిపోతున్న తెలుగు సినిమా స్టైల్ మార్చి హీరోయిజం పరిచయం చేసిన నటుడుగా చిరంజీవి పేరు టాలీవుడ్ సినీ చరిత్రలో కచ్చితంగా నిలిచిపోతుంది.
అలాగే సినిమాలకి డాన్స్ లతో అందం తీసుకొచ్చిన చిరంజీవి ఎంతో మంచి ప్రస్తుతం తరం హీరోలకి డాన్స్ లో రోల్ మోడల్ గా ఉన్నారు.హీరోగా చిత్ర పరిశ్రమలో నెంబర్ వన్ గా నిలవడంతో పాటు కుటుంబానికి పెద్దన్నగా ఉంటూ తన ఫ్యామిలీని ఉన్నత స్థానంలో నిలపడం ద్వారా ఒక పెద్ద కొడుకుగా తన పాత్రని పూర్తి స్థాయిలో నిర్వహించాడు.
అలాగే పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వడంతో ద్వారా బెస్ట్ ఫాదర్ గా నిలిచిపోయారు.ఇలా ఎన్నో విషయాలలో చిరంజీవి జీవితం ఎంతో మందికి ఆదర్శం అని చెప్పాలి.
అతని జీవితంలో అపజయం అంటే అది కేవలం రాజకీయాలోనే అని చెప్పాలి.
మరి అలాంటి చిరంజీవి జీవిత కథని తెరపై చూసే అవకాశం లేకపోవచ్చేమో కానీ భవిష్యత్తులో పుస్తక రూపంలో మాత్రం చదివే అవకాశం దొరకనుంది.తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో సందర్భంగా ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు.తన జీవితం భవిష్యత్తులో ఎంతో మందికి కొంత అయినా స్ఫూర్తి ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఆటో బయోగ్రఫీ రాయాలని అనుకుంటున్నా అని చెప్పుకొచ్చారు.
తన జీవితంలో ఇక ఒక్క ఆటో బయోగ్రఫీ రాయాలనే కోరిక తప్ప మరేదీ లేదని తెలిపారు.భవిష్యత్తులో తన జీవిత కథకి అక్షరరూపం తీసుకొచ్చి తానే అందరి ముందుకి తీసుకొస్తానని మెగాస్టార్ చిరంజీవి చెప్పారు.
మరి ఆయన జీవితంలో చెరిగిపోని మచ్చలాంటి రాజకీయ జీవితం గురించి ఏమైనా చర్చిస్తారా అనేది చూడాలి.